అక్షయ్ కుమార్‌కు భారతీయ పౌరసత్వం.. ఆ రెండు హిందూస్థానీ అంటూ నెటిజన్ల ట్రోలింగ్‌కు ధీటైన జవాబు!
ఇండియాలో ఉంటూ కెనడా పౌరసత్వంతో సినిమాలు చేయడంపై గత కొద్దికాలంగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ విమర్శలు ఎదుర్కొంటున్నారు. కొన్ని సందర్భాల్లో అక్షయ్ కుమార్‌ను నెటిజన్లు భారీగా ట్రోల్ చేయడం తెలిసిందే. అయితే 77వ స్వాత్రంత్య దినోత్సవం రోజున అక్షయ్ కుమార్‌కు భారతీయ పౌరసత్వం లభించింది. భారత ప్రభుత్వం నుంచి ఆయన తన పౌరసత్వాన్ని తిరిగి పొందిన విషయాన్ని స్వయంగా ట్విట్టర్‌లో వెల్లడించారు. దాంతో భారతీయుడు కాదనే విమర్శలకు, ట్రోల్స్ ఈ విధంగా అక్షయ్ కుమార్ తెరదించారు. ఈ వార్తకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

భారత 77వ స్వాతంత్ర దినోత్సవం వేడుకల సందర్బంగా అక్షయ్ కుమార్ దేశ ప్రజలకు, అభిమానులకు శుభాకాంక్షలు అందిస్తూ.. తనకు భారతీయ పౌరస్వతం లభించిందనే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. నా హృదయం, నా పౌరసత్వం రెండు కూడా హిందుస్తానీ. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. జై హింద్ అంటూ ట్వీట్ చేశారు.

తనకు భారత పౌరసత్వం లభించిందనే విషయాన్ని అధికారికంగా వెల్లడిస్తూ.. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన పత్రాన్ని అక్షయ్ కుమార్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. భారత పౌరసత్వం గుర్తింపు కాపీ, డైరీని ఆయన ఫోటో తీసి ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

ఇటీవల జాతీయ మీడియాలో మాట్లాడుతూ.. భారతీయ పౌరసత్వం గురించి దరఖాస్తు చేసుకొన్నాను. ఈ దేశంపై నాకు ప్రేమ ఉందని నేను ప్రజలకు, నా అభిమానులకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇండియా అంటే నాకు పంచ ప్రాణాలు. నా దేశం నాకు ఎంతో ఇచ్చింది. డబ్బు, గుర్తింపు, హోదా ఇచ్చిన దేశం అంటే నాకు చాలా ఇష్టం అని అక్షయ్ కుమార్ తెలిపారు.

అక్షయ్ కుమార్ విషయానికి వస్తే.. బాలీవుడ్‌లో అత్యధిక ప్రేక్షకాదరణ పొందిన నటుల్లో ఒకరు. ఆయన ఖాతాలో భారీ హిట్లు ఉన్నాయి. గత కొద్దికాలంగా ఆయన నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. దాదాపు 15 చిత్రాలకుపైగా బాక్సాఫీస్ వద్ద పరాజయం సొందాయి. ప్రస్తుతం ఆయన నటించిన ఓ మై గాడ్ (OMG 2) చిత్రం రిలీజై ఘనంగా నడుస్తున్నది.


Click it and Unblock the Notifications











