అక్షయ్ కుమార్ గొప్ప మనసు.. ఆమె కష్టం గురించి తెలుసుకుని!
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మరో మరు రియల్ హీరో అనిపించుకున్నాడు. సాయం అందించడంలో అక్షయ్ కుమార్ ఎప్పుడూ ముందుంటాడు. యాసిడ్ దాడికి గురై అనేక సర్జరీల తరువాత ప్రాణాలు నిలుపుకున్న లక్ష్మి అగర్వాల్ ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులని ఎదుర్కొంటోంది.
లక్ష్మి అగర్వాల్ కష్టం గురించి గురించి ఓ పత్రిక ప్రచురించిన వార్త ద్వారా తెలుసుకున్న అక్షయ్ కుమార్ వెంటనే సాయం అందించేందుకు ముందుకు వచ్చాడు. లక్ష్మికి 5 లక్షల ఆర్థిక సాయం చేశాడు. నేను చేసినా సాయాన్ని గొప్ప పనిగా చెప్పుకోను. లక్ష్మికి మంచి ఉద్యోగం దొరికేవరకు.. ఇంటి అద్దె, పిల్లల పోషణ కోసం ఏ సాయం చేశానని అక్షయ్ కుమార్ తెలిపాడు.

అక్షయ్ కుమార్ గొప్ప మనసుని అభిమానులంతా కొనియాడుతున్నారు. 2005 లో యాసిడ్ దాడికి గురైన లక్ష్మి ప్రస్తుతం సరైన ఉద్యోగం లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది.


Click it and Unblock the Notifications











