ప్రపంచంలోనే సంపన్న నటుడిగా అక్షయ్ కుమార్.. గతేడాది సంపాదన ఎంతంటే!
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ప్రపంచంలోనే అత్యధిక సంపన్న నటుల జాబితాలో చేరారు. ప్రసిద్ధ ఫోర్బ్స్ 2020 సంవత్సరానికి సంపన్నుల జాబితాను రూపొందించగా అక్షయ్ కుమార్ టాప్ 10 స్ఠానాల్లో చోటు దక్కించుకొన్నారు. మంగళవారం ఫోర్బ్స్ జాబితాను రిలీజ్ చేసింది. ఈ జాబితాలో అక్షయ్ కుమార్‌కు ఎన్నో స్థానం దక్కిందంటే..

తొలిస్థానంలో డ్వేన్ జాన్సన్
ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా సంపాందించే నటుల జాబితాను ఫోర్బ్స్ ప్రకటించగా, అందులో హాలీవుడ్ నటుడు డ్వేన్ జాన్సన్‌కు తొలి స్థానంలో నిలిచారు. డ్వేన్ జాన్సన్ గతంలో రిజ్లింగ్ క్రీడాకారుడిగా అందరికి తెలిసిన వారే. ఈ జాబితాలో డ్వేన్ జాన్సన్ టాప్ స్థానాన్ని దక్కించుకోవడం ఇది రెండోసారి అని ఫోర్బ్స్ వెల్లడించింది.

డ్వెయిన్ సంపాదన, రెండు మూడు స్థానాల్లో
ఫోర్బ్స్ జాబితాలో మొదటి స్థానంలో నిలిచిన డ్వెయిన్ జాన్సన్ 2019 జూన్ నుంచి 2020 జూన్ వరకు 87.5 మిలియన్ డాలర్లు అంటే అక్షరాల 654 కోట్ల రూపాయలు సంపాదించారు. రెడ్ నోటీస్ అనే చిత్రంలో నటించినందుకు గాను జాన్సన్ సుమారు 175 కోట్ల రూపాయల పారితోషికం తీసుకోవడం ఓ రికార్డు. ఇక రెండ్ నోటీస్ చిత్రంలో నటించిన ర్యాన్ రెనాల్డ్20 మిలియన్ల డాలర్లతో అంటే సుమారు 150 కోట్లతో రెండోస్థానంలో నిలిచారు.

టాప్ పది స్థానాల్లో
ఫోర్బ్స్ జాబితాలో మార్క్ వాల్ బెర్గ్ (58 మిలియన్ డాలర్లు) మూడోస్థానంలో, బెన్ అఫ్లెక్ (55 మిలియన్ డాలర్లు) నాలుగోస్థానంలో, విన్ డీజిల్ (54 మిలియన్ డాలర్లు)ఐదోస్థానంలో నిలిచారు. ఇంకా ఈ జాబితాలో లిన్ మ్యాన్యుయేల్ మిరాండా, విల్ స్మిత్, ఆడమ్ సాండ్లర్, జాకీ చాన్ తదితరులు ఉన్నారు.

అక్షయ్ కుమార్ ఆరో స్థానంలో
ఇక అక్షయ్ కుమార్ విషయానికి వస్తే ఫోర్బ్స్‌లో ఆరో స్థానంలో నిలిచారు. యాడ్స్, సినిమాల్లో నటించండం ద్వారా భారీగా ఆదాయాన్ని సాధించారు. గతేడాది కాలంలో అక్షయ్ సంపాదన 48.5 మిలియన్ డాలర్లు అంటే సుమారు 363 కోట్ల రూపాయలతో ఆరోస్థానాన్ని దక్కించుకొన్నారు. ఇవి సిబ్బంది జీతాలు, టాక్స్ చెల్లింపులు జరపకముందు ఆదాయం అని ఫోర్బ్స్ ఓ ప్రకటనలో తెలిపింది.
Recommended Video

లండన్‌లో బెల్ బాటమ్‌తో బిజీ బిజీ
లాక్‌డౌన్ తర్వాత అక్షయ్ కుమార్ ప్రస్తుతం లండన్‌లో బెల్ బాటమ్ చిత్ర షూటింగులో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో వాణి కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నది. ఇక అక్షయ్ కుమార్ నటించిన లక్ష్మీబాంబ్ చిత్రం త్వరలోనే డిస్నీ+హాట్ స్టార్ ద్వారా రిలీజ్ కానున్నది. ఇవియే కాకుండా పలు యాడ్ ఫిలింస్‌లో అక్షయ్ కుమార్ నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











