అద్దంలో చూసుకొని నటనకు పనికిరానా? ఆ డైరెక్టర్ లైఫ్‌ను మార్చేశాడు.. అక్షయ్ కుమార్
బాలీవుడ్‌లో ప్రతీ సంవత్సరం అత్యధిక సినిమాలు చేసే ఏకైక హీరో ఎవరంటే గుక్క తిప్పుకోకుండా చెప్పే స్టార్ అక్షయ్ కుమార్. ప్రతీ సంవత్సరం అరడజనుకుపైగా సినిమాల్లో నటిస్తూ తన స్టార్ స్టామినాతో ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నారు. రొటీన్ సినిమాలు, పాత్రలు కాకుండా విభిన్నమైన పాత్రలు, విలక్షణమైన నటనతో మూడు దశాబ్దాలుగా ఆయన తన సత్తా చాటుతున్నారు. తాజాగా ఆయన విష్ణు మంచు సారథ్యంలో డాక్టర్ మోహన్ బాబు నిర్మాతగా రూపొందిన కన్నప్ప సినిమాలో శివుడి పాత్రలో మరోసారి ఆలరించనున్నారు. ఈ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ఆయన ఫిల్మీబీట్‌కు ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో ఎడిటర్ రాజబాబుతో మాట్లాడారు. అక్షయ్ కుమార్ కెరీర్ గురించి, అలాగే తన లైఫ్ జరిగిన విషయాలను ఎమోషనల్ చెబుతూ..
ప్రస్తుత సంవత్సరంలో కేసరీ 2 లాంటి ఎమోషనల్ క్యారెక్టర్‌ను, అలాగే హౌస్‌ఫుల్ 5 లాంటి అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమాలో టపోరి క్యారెక్టర్‌లో నటించి మెప్పించాడు. ఇలాంటి పాత్రల ఎంపిక గురించి ఆయన చెబుతూ భావోద్వేగానికి గురయ్యాడు. విభిన్న పాత్రలను పోషించడం గురించి ఆయన తన అనుభవాలను వెల్లడిస్తూ..

ఏడేళ్లు యాక్షన్ సినిమాలే..
విభిన్న రకాల పాత్రలు పోషించడం, కేసరి 2 సినిమా తర్వాత హౌస్‌ఫుల్ 5 సినిమా లాంటి పాత్రలను చేయడం కష్టమే కానీ.. సినిమా అంటే ప్రేమ, ఇష్టం. అందుకే నేను ఏ పాత్రలోకైనా దూరిపోతాను. బాలీవుడ్‌లో నేను ఇండస్ట్రీలోకి ప్రవేశించిన సమయంలో ఎక్కువగా యాక్షన్ సినిమాలు చూశాను. ప్రతీ రోజు షూటింగ్‌కు వెళ్లగానే.. సార్.. మీరు అక్కడ నుంచి.. ఇక్కడ నుంచి దూకమని చెప్పేవాళ్లు.. కొన్ని డైలాగ్స్ చెప్పమనే వారు.. పాటలపై డ్యాన్సులు చేయమనే వారు. నేను తప్పనిపరిస్థితుల్లో యాక్షన్ సినిమాలు చేశాను. అలా ఏడేళ్లు గడిచిపోయాయి. నేను చేస్తున్నదేమీటి? ఇదేనా నా కెరీర్ అనుకొంటూ ఒక రోజు ఆలొచించాను అని అక్షయ్ కుమార్ చెప్పాడు.
అద్దంలో ముఖం చూసుకొని
యాక్షన్ తప్ప మంచి పాత్రలు చేసే సామర్థ్యం నాకు లేదా? ఒక రోజు నా ఇంటి 12వ అంతస్థు నుంచి కిందకు వచ్చేటప్పుడు లిఫ్టులోని అద్దంలో నా ఫేస్ చూసుకొన్నాను.నేను యాక్షన్ తప్ప ఇంకా ఏమీ చేయలేనా? అనే బాధ కలిగింద. నేను బాగా నటిస్తానని ఎవ్వరికి నమ్మకం లేకపోవడం బాధ కలిగించింది. ఆ తర్వాత నేను రకరకాలుగా ప్రయత్నించాను. చాలా మందిని మంచి పాత్రలు ఇవ్వమని అడుక్కొన్నాను. అలా నాకు మంచి పాత్రలు రావడం మొదలైంది అని అక్షయ్ కుమార్ చాలా ఎమోషనల్‌గా చెప్పారు.
ప్రియదర్శన్ ఎంట్రీతో
నా జీవితం, కెరీర్ అంతా యాక్షన్ సినిమాలే అయినప్పుడు నన్ను నమ్మండి. మంచి పాత్రలు ఇస్తే ఇంకా బాగా నటిస్తానని అందర్నీ అడిగాను. అలాంటి సమయంలో నా లైప్ లోకి దర్శకుడు ప్రియదర్శన్ వచ్చాడు. ఆయన హెరా ఫెరీ సినిమాను ఇచ్చాడు. ఆ తర్వాత మహేష్ భట్ ద్వారా సంఘర్ష్, ఎహలాన్ సినిమాలో నటించాను. అలా నట జీవితం మారిపోయింది. అలా విభిన్నమైన పాత్రలు నా ముందుకు వచ్చాయి. ఒక పాత్రకు మరో పాత్ర పోలీక లేకుండా సినిమాలను ఎంచుకొంటున్నాను. ఇది నేను పూర్తిగా, స్వయంగా తీసుకొన్న నిర్ణయం అని అక్షయ్ కుమార్ చెప్పారు.

డైరెక్షన్ చేసే ఉద్దేశం లేదు
మూడు దశాబ్దాలకు పైగా కెరీర్, 150 సినిమాల్లో నటించాను. కానీ నాకు డైరెక్షన్ చేయాలనే లేదు. ఎందుకంటే నేను ప్రశాంతంగా జీవితాన్ని గడపాలనుకొంటున్నాను. డైరెక్షన్ చేసే మైండ్ సెట్ నాకు లేదు. దానికి చాలా ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. డైరెక్టర్ కావడానికి విష్ణు మంచు సిద్దంగా ఉన్నాడు. నా మాట గుర్తుపెట్టుకొండి. ఒక రోజు ఆయన డైరెక్టర్ అవుతాడు. డైరెక్టర్ కావడానికి అన్ని అర్హతలు ఉన్నాయి. ప్రతీ విభాగంలోను చొరవ తీసుకొంటాడు. ఆర్ట్, డైలాగ్, ఇతర విభాగాలపై మంచి పట్టు ఉంది. అందుకే ఆయన డైరెక్టర్ అవుతాడని అక్షయ్ కుమార్ చెప్పారు.


Click it and Unblock the Notifications











