For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ముద్దు పెట్టలేదని వదిలేసింది.. పెళ్లి కంటే ముందే ఒక లవ్ స్టొరీ.. బ్రేకప్ గురించి చెప్పిన స్టార్ హీరో

  |

  బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన అక్షయ్ కుమార్ ఏం చెప్పినా కూడా చాలా ఓపెన్ గా చెప్పేస్తుంటాడు. రియల్ లైఫ్ లో అతనికి ఎదురైన ఎన్నో చేదు అనుభవాలను కూడా ఇంటర్వ్యూలలో క్లియర్ గా చెప్పేసేవాడు. ఇక ఇటీవల అక్షయ్ కు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఇంటర్వ్యూలో అక్షయ్ తన ఫస్ట్ బ్రేకప్ స్టోరీ గురించి చాలా కామెడీగా చెప్పేశాడు.

  ఆర్థిక సహాయలను అందించడంలో ముందుంటాడు.

  ఆర్థిక సహాయలను అందించడంలో ముందుంటాడు.


  వెండితెరపైన మంచి సందేశాత్మక చిత్రాలు అందించడంలో అక్షయ్ ముందుటాడు. కమర్షియల్ సినిమలైనా.. రియల్ లైఫ్ స్టోరీస్ అయినా తనదైన శైలిలో అందరిని మెప్పించేలా ప్రెజెంట్ చేయడం అక్షయ్ కి ఉన్న స్పెషల్ టాలెంట్. అలాగే ఏదైనా విపత్తులు వచ్చినప్పుడు కూడా అక్షయ్ ఆర్థిక సహాయలను అందించడంలో ముందుంటాడు. ఆర్మీ కోసమైనా రైతుల కోసమైనా వెంటనే స్పందింస్తూ ఉంటాడు.

   సీక్రెట్ లవ్ స్టొరీ..

  సీక్రెట్ లవ్ స్టొరీ..

  ఇక అక్షయ్ కుమార్ - ట్వింకిల్ ఖన్నాలు ప్రేమలో ఉన్నట్లు అప్పట్లో ఎవరు అంతగా పసిగట్టలేకపోయారు. వారి ప్రేమ వ్యవహారాలు చాలా రోజుల తరువాత బయటపడ్డాయి. మొత్తానికి 2001లో పెళ్లితో మరింత దగ్గరైన ఈ జంట బెస్ట్ లవ్ బర్డ్స్ గా సినీ ప్రముఖుల నుంచి కామెంట్స్ అందుకున్నారు. ఎందుకంటే ఇద్దరు కూడా వివాదాలకు రూమర్స్ కి తావివ్వకుండా బెస్ట్ లవ్ స్టోరీని నడిపించారు.

  పెళ్లి కంటే ముందే మరో లవ్ స్టొరీ

  పెళ్లి కంటే ముందే మరో లవ్ స్టొరీ


  అయితే ట్వింకిల్ కంటే ముందే అక్షయ్ కుమార్ ఒక ప్రేమ వ్యవహారాన్ని నడిపించాడు. అయితే ఆమె ఉహీంచని విదంగా వదిలేసి వెళ్లిపోయిందని అన్నాడు. గతంలో హౌజ్ ఫుల్ 4 ప్రమోషన్ లో భాగంగా కపిల్ శర్మ కామెడీ షోలో పాల్గొన్న అక్షయ్ ఈ విషయాన్ని మొహమాటం లేకుండా చాలా కామెడీగా బయటపెట్టేశాడు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవ్వడం విశేషం.

   ముద్దు కూడా పెట్టుకోలేదు..

  ముద్దు కూడా పెట్టుకోలేదు..


  అక్షయ్ మాట్లాడుతూ.. నా ఫస్ట్ లవ్ స్టోరీలో అమ్మాయిని ఎంతగానో ఇష్టపడేవాడిని. అప్పుడు నాకు సిగ్గు ఎక్కువ. రెస్టారెంట్, సినిమాలకు బాగానే తీసుకెళ్లేవాడిని. నాలుగు సార్లు డేట్ కు కూడా వెళ్ళాం. అయితే ఎక్కడికెళ్లినా కూడా ఆమె చేతిని కనీసం తాకడానికి కూడా ధైర్యం ఉండేది కాదు. ఒక్క ముద్దు కూడా పెట్టుకోలేదు..

  తప్పుగా అర్థం చేసుకుంది

  తప్పుగా అర్థం చేసుకుంది


  అయితే ఆ అమ్మాయిని కనీసం ముద్దు కూడా పెట్టుకోకపోవడంతో తప్పుగా అర్థం చేసుకుంది. దీంతో ఆ అమ్మాయి వీడు నాపై ప్రేమను చూపించడం లేదని బ్రేకప్ చెప్పేసి వదిలేసి వెళ్లిపోయిందని అక్షయ్ కుమార్ వివరణ ఇచ్చారు. ఆ విధంగా తన మొదటి లవ్ స్టొరీ ఎండ్ అయ్యిందని చెప్పిన అక్షయ్ కుమార్ ఆ తరువాత మళ్ళీ అలా ఉండలేదని కూడా సరదాగా కామెంట్ చేశాడు.

  English summary
  Akshay Kumar, one of the Bollywood star heroes, has come up with a good message for the silver screen. Akshay's Special Talent Presenting to everyone in his own style, whether it be commercial movies or real life stories. Recently, however, the heroine's wife Twinkle Khanna unexpectedly reacted to the gay rumors on Akshay.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X