ఫస్ట్ మీట్ లోనే అలా అనేశాడు... మంచు విష్ణు బిహేవియర్ పై అక్షయ్ కుమార్ షాకింగ్ కామెంట్స్!

మూవీ ఆర్టిస్ట్స్ అస్సోసియేషన్ (మా) అధ్యక్షుడు, టాలీవుడ్ హీరో మంచు విష్ణు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. డైలాగ్ కింగ్, కలక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు తనయుడిగా, టాలీవుడ్ హీరోగా అందరికి సుపరిచితుడే. ఓ వైపు నటుడుగా అలరిస్తూనే.. మరో వైపు 'మా' బాధ్యతలను చూస్తున్నారు. ఇదిలా ఉంటే మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా హిందూ పురాణాల ఆధారంగా హిస్టరికల్ డ్రామాగా 'కన్నప్ప' చిత్రాన్ని తెరకకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం మూవీ షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. 2025 మహాశివ రాత్రి సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన స్పెషల్ టీజర్ ను తాజాగా విడుదల చేసారు. ఈ ఈవెంట్ కి బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ హాజరయ్యారు. టీజర్ లాంచ్ తర్వాత ఆసక్తికరమైన స్పీచ్ ఇచ్చారు. ఈ సందర్భంగానే మంచు విష్ణు తో తన జర్నీ స్టార్ట్ పై మాట్లాడారు. మొదట ఎలా కలిశారు. మంచు విష్ణు అక్షయ్ కుమార్ ను ఎలా రిసీవ్ చేసుకున్నారు. ఏం మాట్లాడారన్న విషయాలను వేదిక పైనే చెప్పడం ఎప్పుడు ఆసక్తికరంగా మారింది.

Akshay kumar shocking comments on kannappa star manchu vishnu Bollywood star explained that actor behaviour

అక్షయ్ కుమార్ మాట్లాడుతూ.... ఫస్ట్ టైం మంచు విష్ణును హైదరాబాద్ లోనే కలిసాను. అయన ఎంతో మర్యాద గా రిసీవ్ చేసుకున్నారు. విష్ణు మాట్లాడుతూ ఉంటే ఎంతో జెన్యూన్ పర్సన్ అనే భావన కలిగింది. అందుకు తగినట్టుగానే ఇలా అన్నాడు. తనకి ప్యూర్ హిందీ రాదని, హైదరాబాద్ హిందీ లో మాట్లాడగలనని ఒప్పుకున్నారు. అలాగే మరిన్ని విషయాల్లోనూ చాలా జెన్యూన్ గా కనిపించాడు. హంబల్ బిహేవియర్ తో తన మనసు గెలుచుకున్నాడని తెలిపాడు.

ఆ తర్వాత నుంచి మంచు విష్ణు తో ట్రావెల్ చేస్తున్నట్టు చెప్పారు. అయన జెన్యూన్ బిహేవియర్ చూసే 'కన్నప్ప' స్టోరీ కూడా వినకుండా ఓకే చెప్పాను. ఆ తర్వాత మంచు విష్ణు చెప్పిన సన్నివేశాల పై ఫోకస్ పెట్టానని చెప్పారు. అలా 'కన్నప్ప' ప్రాజెక్ట్ లోకీ ఎంట్రీ ఇచ్చానని అక్షయ్ కుమార్ వివరించారు. ఇక గతంలో మంచు విష్ణు పై కొందరు కావాలని ట్రోల్స్ చేసిన సంగతి తెలిసిందే. కానీ బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ విష్ణు పై ప్రశంశలు కురిపించడం తో అవన్నీ తుడిచి పెట్టుకుని పోయాయి.

Akshay kumar shocking comments on kannappa star manchu vishnu Bollywood star explained that actor behaviour

ఇక మంచు విష్ణు 'కన్నప్ప' మూవీని ఎంత ప్రత్యేకంగా తీసుకున్నారో తెలిసిందే. ఇండియా లోనే బడా స్టార్స్ ని దింపి.. అప్పటి వరకు తన సినిమాల పై నవ్వే నార్లను ముయించారు. ఇప్పటికీ 'కన్నప్ప' నుంచి వచ్చిన అప్డేట్స్ కు అంచనాలకు మించి రెస్పాన్స్ దక్కుతోంది. గతంలో వచ్చిన టీజర్, రీసెంట్ గా మహా శివరాత్రి సందర్భంగా విడుదల చేసిన 'శివా శివా శంకర' సాంగ్ కు విపరీతమైన స్పందన లభించింది. ఒక్క సాంగ్ తో ప్రాజెక్ట్ పై మంచు విష్ణు తార స్థాయి అంచనాలను పెంచేసారు. దీంతో మున్ముందు రాబోయే ప్రమోషనల్ అప్డేట్స్ పైన ఆసక్తి పెరిగింది.

ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో అలరించాబోతున్నారు. రెబెల్ స్టార్ ప్రభాస్ రుద్ర గా 20 నిమిషాల పాటు కనిపిస్తారని తెలుస్తోంది. ఇక కాజల్ అగర్వాల్ పార్వతి గా దర్శనం ఇవ్వబోతోంది. మలయాళం స్టార్ మోహన్ లాల్ కిరాట పాత్రను పోషించారు. ఇక మంచు విష్ణు తిన్నడు పాత్రలో అలరించబోతున్నారు. మంచు మోహన్ బాబు రూ.100 కోట్లకు పైగా బడ్జెట్ వెచ్చించి అత్యంత ప్రతిష్టత్మాకంగా నిర్మిస్తున్నారు. ముకేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. 2025 ఏప్రిల్ 25న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, అలాగే ఇంగ్లీష్ లోను గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X