బర్నింగ్ స్టార్ కోసం ఏకం అవుతున్న బిగ్ బాస్ సెలెబ్రిటీలు.. ఎందుకో తెలుసా!
నటుడు సంపూర్ణేష్ బాబు కడుపుబ్బా నవ్వించే కామెడీ స్పూఫ్ లతో బర్నింగ్ స్టార్ గా మారాడు. సంపూర్ణేష్ బాబు నటించిన కొబ్బరి మట్ట చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు కాబోతున్నాయి. సెప్టెంబర్ 21 శుక్రవారం రోజు ఈ చిత్ర సాంగ్ ప్రోమో విడుదల చేయబోతున్నారు. కేవలం సాంగ్ ప్రోమోని కదా అని కొట్టిపారేయడానికి లేదు. దీనికోసం బర్నింగ్ స్టార్ చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు.
సంపూ సినిమా కోసం బిగ్ బాస్ తెలుగు మొదటి సీజన్ సభ్యులంతా ఏకం అవుతున్నారు. శివ బాలాజీ, అర్చన, ఆదర్శ్, నవదీప్, హరితేజ వంటి సెలెబ్రిటీలంతా బిగ్ బాస్ మొదటి సీజన్ లో పాల్గొన్న సంగతి తెలిసిందే. సంపూర్ణేష్ బాబు కూడా బిగ్ బాస్ లో పాల్గొన్నాడు.

వీరందరి చేతుల మీదుగా కొబ్బరి మట్ట సాంగ్ ప్రోమో శుక్రవారం సాయంత్రం 6: 30 గంటలకు విడుదుల కానుంది. ప్రసాద్ లాబ్స్ లో ఈ ఈవెంట్ ని ప్లాన్ చేశారు. బర్నింగ్ స్టార్ సంపూ నుంచి వస్తున్న మరో కామెడీ స్పూప్ చిత్రం కొబ్బరి మట్ట.


Click it and Unblock the Notifications











