twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నైట్ పార్టీలో మునిగి తేలిన స్టాఫ్... ఫీలైన అల్లు అర్జున్!

    |

    స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసిన పిక్ హాట్ టాపిక్ అయింది. శనివారం రాత్రి వారంతా పార్టీలో మునిగి తేలిసిన నేపథ్యంలో ఆయన ఓ ఫోటో పోస్ట్ చేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన స్టాప్ చేసిన పనికి ఆయన కాస్త ఫీలైనట్లు బన్నీ కామెంట్ చూస్తే స్పష్టమవుతోంది.

    అల్లు అర్జున్ తన వద్ద పని చేసే సిబ్బందిని ఎంతో బాగా చూసుకుంటారని ఇండస్ట్రీలో అంతా చర్చించుకుంటారు. వారు సంతోషంగా ఉంటేనే తాను సంతోషంగా ఉంటాను అని ఆయన చాలా సందర్భాల్లో సన్నిహితులతో చెప్పారు. అలాంటి వ్యక్తి ఇపుడు వారిపై ఫీలవ్వడానికి కారణం ఏమిటో తెలియాలంటే... ఈ స్టోరీ చదవాల్సిందే.

    అందుకే బన్నీ ఫీలయ్యాడు

    అందుకే బన్నీ ఫీలయ్యాడు

    శనివారం రాత్రి స్టాఫ్ అంతా పార్టీ చేసుకున్నారు. అయితే తనను పిలవక పోవడంపై అల్లు అర్జున్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఆదివారం ఉదయం నాకు కనిపించే దృశ్యం... నా స్టాఫ్‌ అంతా శనివారం రాత్రి పార్టీల్లో మునిగితేలుతారు. రాత్రి వేళల్లో వారు ఎంజాయ్‌ చేసే విధానం నా కంటే భిన్నంగా ఉంటుంది. చాలా సంతోషంగా గడుపుతారు. మీరు నన్ను కూడా పిలవాల్సింది' అని వ్యాఖ్యానించారు.

    ఈ మధ్య కాలంలో పార్టీలు బాగా మిస్సవుతున్న బన్నీ

    ఈ మధ్య కాలంలో పార్టీలు బాగా మిస్సవుతున్న బన్నీ

    ఒకప్పుడు బన్నీ కూడా తరచూ ఇలాంటి పార్టీలకు వెళ్లే వాడు. అయితే ప్రస్తుతం షూటింగ్ బిజీ వల్ల, మిగతా సమయాన్ని ఇంట్లో ఫ్యామిలీ, పిల్లలతో గడపాల్సిన పరిస్థితి వల్ల బన్నీ ఇలాంటి పార్టీల బాగా మిస్సవుతున్నారట. అందుకే తన సిబ్బంది నైట్ పార్టీ లైఫ్ చూడగానే ఆయన ఇలా ఆసక్తికరంగా స్పందించారు.

    అల్లు అర్జున్

    అల్లు అర్జున్

    అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో తన 19వ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ‘జులాయి', ‘సన్నాఫ్ సత్యమూర్తి' తర్వాత వీరి కాంబినేషన్లో వస్తున్న మూడో చిత్రం. ఈ మధ్య కాలంలో సరైన హిట్టు లేని బన్నీ.... ఈ సారి ఎలాగైనా హిట్టుకొట్టాలనే కసితో ఈ చిత్రం చేస్తున్నారు. అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణ సంయుక్తంగా ఈ చిత్రం నిర్మిస్తున్నారు.

    ఇంత సినిమాలను ప్రమోట్ చేస్తూ...

    ఇంత సినిమాలను ప్రమోట్ చేస్తూ...

    గతవారం విడుదలైన ‘బ్రోచేవారెవరురా', ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' చిత్రాలను బన్నీ ప్రమోట్ చేశారు. ఈ రెండూ తనకు ఎంతగానో నచ్చాయన్నారు. ‘బోచేవారెవరురా' లాంటి భిన్నమైన కథలను ఎంచుకుంటూ శ్రీవిష్ణు దూసుకెళుతున్నాడని, అతడి కథల సెలక్షన్ బావుంటుందిన తెలిపారు.

    English summary
    "1st thing I see Sunday morning...all my staff partying on Saturday nite. Their night life is def more happening than mine. U guys should have called me too." Allu Arjun tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X