Naresh 62: మరో డిఫరెంట్ మూవీతో నరేష్.. ఆ కాలం నాటి కథ.. బార్‌లో ఒప్పుకున్న హీరో

ప్రముఖ డైరెక్టర్, దివంగత ఈవీవీ సత్యనారాయణ కుమారుడిగా పరిచయం అయ్యాడు అల్లరి నరేష్. మొదటి సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్న ఈ కామేడీ హీరో హాస్య భరిత సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచాడు. కానీ ఇటీవల మాత్రం సీరియస్ కాన్సెప్ట్ చిత్రాలతో మరింతగా మెప్పిస్తున్నాడు. ఇటీవలే ఉగ్రం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి తన నట ఉగ్రరూపాన్ని చూపించిన నరేష్ తాజాగా మరో విభిన్నమైన సినిమాతో రానున్నాడు. ఈ సినిమా కథను బార్‌లో ఓకే చేయగా ఇది హాట్ టాపిక్ గా మారింది.

వైవిధ్యం:కామెడీ చిత్రాలకు పెట్టింది పేరుగా స్పెషల్ ఇమేజ్ సంపాందించుకున్న హీరో అల్లరి నరేష్. ఈ మధ్య కాలంలో నాంది, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, ఉగ్రం వంటి కాన్సెప్ట్ ఒరియెంటెడ్ చిత్రాలతో ప్రేక్షకులను మునుపటికంటే ఎక్కువగా ఆకట్టుకుంటున్నాడు. తనదైన కామెడీ టైమింగ్ తో ఆద్యంతం అలరించిన ఈ హీరో కాన్సెప్ట్ చిత్రాలతో నటనలో సరికొత్త వైవిధ్యం చూపించాడు.

ఆ బ్యాక్ డ్రాప్:ఇక ఇటీవల విడుదలైన ఉగ్రం మూవీతో తన నటనేంటో నిరూపించాడు అల్లరి నరేష్. నాంది వంటి సూపర్ హిట్ ఇచ్చిన విజయ్ కనకమేడల దర్శకత్వంలో రెండోసారి అల్లరి నరేష్ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచన హీరో నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడు మరోసారి డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు ఈ కామెడీ హీరో.

Allari Naresh 62 Movie With Subbu Mangadevi Announced On His Birthday With Video

పుట్టిన రోజున:ప్రస్తుతం నరేష్ 62వ చిత్రం చేస్తున్నాడు. సోలో బ్రతుకే సో బెటర్ సినిమా డైరెక్టర్ సుబ్బు మంగాదేవి దర్శకత్వంలో నరేష్ 62వ సినిమా రానుంది. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ను తాజాగా నరేష్ పుట్టిన రోజు సందర్భంగా ఇవాళ అంటే జూన్ 30న వీడియో ద్వారా ప్రకటించారు. డిఫరెంట్ గా ప్రమోట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

Allari Naresh 62 Movie With Subbu Mangadevi Announced On His Birthday With Video

మూర్ఖత్వం పరిధి:కథ చెప్పడానికి నరేష్ కు డైరెక్టర్ ఫోన్ చేస్తే ఆ స్టోరీ ఫోన్ లో, గుడిలో ఎక్కడా కుదరదని చెప్పి బార్ లో కూర్చోబెడతారు. బార్ లోనే కథ నేరేట్ చేస్తాడు. మూర్ఖత్వం పరిధి దాటిపోయిన ఓ వ్యక్తి కథే ఇది అని సింపుల్ గా స్టోరీ లైన్ చెబుతాడు డైరెక్టర్. కథ ఓకే మరి నిర్మాత, టెక్నిషీయన్స్ కు నచ్చాలి కదా అని నరేష్ అంటే.. అదే బార్ లో పక్కనే కూర్చున్న వాళ్లంతా లేచి తమకు స్టోరీ చెప్పినట్లు అందుకు వాళ్లు ఒప్పుకున్నట్లు చెబుతారు.

Allari Naresh 62 Movie With Subbu Mangadevi Announced On His Birthday With Video

అప్పుడే షూటింగ్:అంతా ఓకే అనడంతో.. సిగరేట్ తీసి కాల్చిన నరేష్.. ఇది మనం చేస్తున్నాం అని స్టైల్ గా చెబుతాడు. ఇలా డిఫరెంట్ గా నరేష్ 62వ సినిమాను ప్రకటించారు. ఇక ఈ సినిమాను హాస్యా మూవీస్ బ్యానర్ నిర్మిస్తుండగా.. సీతారామం ఫేమ్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. 1990 కాలం నాటి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను సెప్టెంబర్ లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుందట.

Allari Naresh 62 Movie With Subbu Mangadevi Announced On His Birthday With Video

మరో సినిమా:ఇక నరేష్ 62వ సినిమాకు రిచర్డ్ ఎమ్ నాథన్ సినిమాటోగ్రఫీ, చోటా కే ప్రసాద్ ఎడిటర్ గా వర్క్ చేయనున్నారు. ఇదే కాకుండా నరేష్ 'సభకు నమస్కారం' అనే మరో సినిమా చేస్తున్నాడు. కామెడీ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమాకు సతీష్ మల్లంపాటి దర్శకత్వం వహిస్తున్నారు. జాతి రత్నాలు చిట్టి ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X