Allari naresh: "ఆ సినిమా కోసం 6 రోజులు పస్తులున్నా, నరకం చూశా.. కానీ నిరాశే మిగిలింది"

టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన అతికొద్ది మంది నటుల్లో అల్లరి నరేశ్ ఒకరు. అల్లరి సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టి సూపర్ హిట్ కొట్టిన ఈయన.. సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చేసుకున్నారు. అయితే కొంత కాలంగా కామెడీ చిత్రాలకు దూరం అయి.. సీరియస్ గా ఉండే చిత్రాలు చేస్తున్నారు. హాస్య నటుడి నుంచి విలక్షన నటుడిగా పేరు తెచ్చుకున్న ఈయన ప్రస్తుతం ఆ ఒక్కటి అడక్కు అనే మరో సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఈ సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చాలానే కష్టపడుతున్నారు. ముఖ్యంగా తరచుగా మూవీ టీంతో కలిసి సెపరేట్ గా అనేక ఇంటర్వ్యూలు ఇస్తూ సందడి చేస్తున్నారు. అయితే తాజాగా సోలోగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అల్లరి నరేష్ షాకింగ్ కామెంట్లు చేశారు. ముఖ్యంగా తాను ఓ సినిమా కోసం పడిన కష్టాలను వివరించారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు రోజుల పాటు ఏమీ తినకుండా ఓ సినిమా కోసం పస్తులు ఉండాల్సి వచ్చిందని.. అలా అనేక కష్టాలు పడుతూ నరకం చూస్తూ చేసిన సినిమా ఫ్లాప్ అయింది తెలిపారు. ఆ చిత్రం ఏంటి, ఆ పూర్తి విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Allari Naresh About His Struggles For Laddu babu Movie Check Details

దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన ఎన్నో ఎవర్ గ్రీన్ మూవీ ఆ ఒక్కటీ అడక్కు.. టైటిల్ తో మరో క్రేజీ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న యంగ్ హీరో అల్లరి నరేష్. ఫరియా అబ్దుల్లా హీరోయిన్ చేస్తున్న ఈ సినిమా మే 3వ తేదీన విడుదల కాబోతుంది. ఈక్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అల్లరి నరేష్ షాకింగ్ కామెంట్లు చేశారు. తన సినిమా కష్టాల గురించి చెప్పుకొచ్చారు. మొదట్లో కేవలం కామెడీ సినిమాలు మాత్రమే చేసిన తాను వరుస ఫ్లాపులతో పంథా మార్చుకోవాల్సి వచ్చిందని వివరించారు.

అంతేకాకుండా ప్రస్తుతం అన్ని రకాల పాత్రలు చేస్తూ.. ప్రేక్షకులకు దగ్గర అవుతున్నానని అన్నారు. అయితే తాను ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో ఓ సినిమా కోసం చాలా ఎక్కువగా కష్టపడ్డానని కానీ ఆ సినిమానే తనను గట్టిగా దెబ్బ కొట్టిందని వివరించారు. లడ్డుబాబు సినిమా కోసం విపరీతమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని చెప్పారు. లావుగా కనిపించేందుకు లోపల బెలూన్లు, వేరే కాస్ట్యూమ్స్ వేసుకోవాల్సి వచ్చిందని.. షూటింగ్ అయిపోయే వరకూ దానితో చాలా ఇబ్బందులు పడ్డానని తెలిపారు.

Allari Naresh About His Struggles For Laddu babu Movie Check Details

అంతేకాకుండా ఈసినిమా కోసం తాను ఆరు రోజులు పస్తులు ఉండాల్సి వచ్చిందని.. ఆ ఆరు రోజులు తాను నరకం చూశానని అన్నారు. అంత కష్టపడి చేసిన లడ్డు బాబు సినిమా ఫెయిల్ అయిందని.. చాలా బాధగా అనిపించిందని వివరించారు. ఇంత కష్టపడి చేసినా సినిమా ఫ్లాప్ అయినా ప్రస్తుతం అదిరిపోయే చిత్రాలతో వస్తూ అందరినీ అలరిస్తున్నారు. మరి మే 3వ తేదీన రాబోతున్న ఆ ఒక్కటి అడక్కు ఏ రేంజ్ లో హిట్టు కొట్టనుందో చూడాలి మరి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X