ఆగిపోయిందనుకున్న సినిమాతోనే.. సంక్రాంతి రేసులో అల్లరి నరేష్

కామెడీ సినిమాలతో ఒకప్పుడు తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న అల్లరి నరేష్ గత కొంత కాలంగా వరుస అపజయాలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఎలాంటి సినిమా చేసినా కూడా ఈ హీరోకు కలిసి రావడం లేదు. దీంతో ఎలాగైనా ఈ సారి సక్సెస్ అందుకోవాలని కొన్ని విభిన్నమైన కథలను ఎంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇటీవల నాంది అనే సినిమా టీజర్ తో పోస్టర్స్ తో కాస్త ఎట్రాక్ట్ చేసిన విషయం తెలిసిందే.

అయితే నాంది రావడానికి ఇంకా సమయం ఉంది. ఇక ఆగిపోయింది అనుకున్న ఒక సినిమాను మొత్తానికి అల్లరోడు థియేటర్స్ లోకి తీసుకురాబోతున్నాడు. కమర్షియల్ ఎలిమెంట్స్ తో వచ్చిన బంగారు బుల్లోడు సినిమాను మొదలు పెట్టి చాలా కాలమవుతోంది. కానీ ఆర్థిక కారణాల వల్ల సినిమా షూటింగ్ పనులల్లో కొన్ని బ్రేకులు పడ్డాయి. ఇక ఫైనల్ గా షూటింగ్ ను ఎలాగోలా పూర్తి చేసిన నరేష్ సైలెంట్ గా సంక్రాంతి రేసులోకి తెచ్చేశాడు.

Allari naresh bangaru bullodu ready to sankranthi race

క్రాక్, రేస్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలతో పాటు అల్లరి నరేష్ బంగారు బుల్లోడు కూడా సంక్రాంతి ఫెస్టివల్ ను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. థియేటర్స్ ఓపెన్ అవ్వడంతో సంక్రాంతికు పూర్వ వైభవం వస్తుందని ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు నమ్మకంతో ఉన్నారు. కరోనా భయం పోయినప్పటికి జనాలు ఇంకా థియేటర్స్ కు మాత్రం అలవాటు కాలేదు. మరి సంక్రాంతికి విసుదలయ్యే విభిన్నమైన సినిమాల కోసమైనా ఆడియెన్స్ వస్తారో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X