అల్లరి నరేష్ ఆశలన్నీ ఆ సినిమాపైనే.. పక్కా హిట్టు బొమ్మ అంటున్నారే!

ఒకప్పుడు టాలీవుడ్ లో మినిమామ్ గ్యారెంటి అనే హీరోగా గుర్తింపు తెచ్చుకున్న హీరో నరేష్. అప్పట్లో ఏడాదికి రెండు మూడు సినిమాలు రిలీజ్ చేసిన నరేశ్ ఇప్పుడు ఏడాది గడిచినా ఒక సినిమాను రిలీజ్ చేయడం లేదు. బాక్సాఫీస్ వద్ద చాలా వరకు డిజాస్టర్స్ ఎదురవ్వడంతో ఇక నుంచి కమర్షియల్ సినిమాలను చేయకూడదని ఫిక్స్ అయ్యాడు. నెక్స్ట్ ఆడియెన్స్ కి సరికొత్త కిక్కివ్వాలని థ్రిల్లర్ సినిమాతో రాబోతున్నాడు.

విజయ్ కనమేడలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నాంది' అనే సినిమాలో నరేష్ మునుపెన్నడు చూడని ఒక ప్రయోగాత్మక పాత్రలో కనిపించబోతున్నాడు. సినిమా ఫస్ట్ లుక్ తోనే ఆడియెన్స్ ని ఆకట్టుకున్నాడు. అయితే ఈ సినిమాతో హిట్టు కొట్టడం గ్యారెంటీ అని చిత్ర యూనిట్ చెబుతోంది. నరేష్ పాత్రలో కనిపించే షేడ్స్ ఆడియెన్స్ ని థ్రిల్ చేస్తాయని అలానే కథలో ఉండే ట్విస్టులు కూడా మెప్పిస్తాయని అంటున్నారు.

Allari naresh big hopes on his upcoming film naandi

ఇక సినిమాలో క్రైమ్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు సామాజిక అంశాలపై మంచి మెస్సేజ్ ఇచ్చే విధంగా కొన్ని సీన్స్ ఉంటాయట. క్లైమాక్స్ లో అయితే నరేష్ నటన అద్భుతంగా ఉంటుందని టాక్ వస్తోంది. నరేష్ గత ఏడాది మహేష్ బాబు మహర్షి సినిమాలో ఒక కీలకపాత్రలో నటించిన విషయం తెలిసిందే. అయితే ఆ పాత్ర ద్వారా నరేష్ కి అనుకున్నంతగా గుర్తింపు అయితే దక్కలేదు. అందుకే హీరోగా తనను తాను నిరూపించుకోవడానికి నాంది సినిమా కోసం నరేష్ తీవ్రంగా కష్టపడుతున్నాడు. మరి ఆ సినిమా ఎంతవతకు సక్సెస్ అవుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X