ఏడాదిలో 8 సినిమాలు చేసిన అల్లరి హీరో.. 17ఏళ్ళ కెరీర్‌లో ఫస్ట్ టైమ్, ఒక్క సినిమా కూడా లేకుండా..
సినిమా ఇండస్ట్రీలో ఒక హిట్టు పడితే ఆ యాక్టర్ ను ఆపడం ఎవరి తరం కాదు. ఒకప్పుడైతే రాత్రికి రాత్రే వరుసగా సినిమాలకు అడ్వాన్స్ లు అందుకున్న నటీనటులు చాలా మంది ఉండేవారు. ఇక ఇప్పుడు మాత్రం అలాంటి ఆఫర్స్ వచ్చినా కూడా కొంచెం జాగ్రత్తగా అడుగులు వేస్తూ ఎలా పడితే అలా కథలను ఓకే చేయడం లేదు. ఇక గత కొంత కాలంగా అల్లరి నరేష్ కూడా అలాంటి తరహాలోనే అడుగులు వేస్తున్నాడు.

ఒకప్పుడు బిజీ బిజీగా..
ఒకప్పటి స్టార్ కామేడి డైరెక్టర్ EVV సత్యనారాయణ కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అల్లరి నరేష్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి దాదాపు 17ఏళ్లవుతోంది. మొదట్లో ఈ హీరో ఉన్నంత స్పీడ్ గా మరేహిరో కూడా లేడనే చెప్పాలి. అతని హవా 2015వరకు బాగానే కొనసాగింది. సంవత్సరంలో 11నెలలు అతను ఎంతో బిజీగా షూటింగ్స్ లలో పాల్గొనేవాడు.

ఒక సంవత్సరంలో 8 సినిమాలు
నరేష్ 2002లో అల్లరి సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఏడాదిలో మినిమమ్ నాలుగైదు సినిమాలు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. 2008లో అయితే వరుసగా 8 సినిమాలను రిలీజ్ చేసి ఇప్పట్లో ఏ హీరో కూడా అందుకొని రికార్డ్ ను అందుకున్నాడు. ఒక విదంగా ఈ జనరేషన్స్ లలో కూడా ఎవరు అంత స్పీడ్ గా చేయలేదనే చెప్పాలి.

అతనితో సినిమాలు చేయడానికి కారణం
చివరగా సుడిగాడు తప్పితే మరొక సినిమా ఆ రేంజ్ లో అయితే సక్సెస్ అవ్వలేదు. ఒక విధంగా అదే అతని కెరీర్ లో అత్యదిక వసూళ్లు అందుకున్న సినిమా. అల్లరి నరేష్ తో అప్పట్లో సినిమా చేయడానికి కారణం అతని మార్కెట్ రేంజ్ లో సినిమాలు నిర్మిస్తే పెట్టిన పెట్టుబడి ఇట్టే వచ్చేది. అందుకే నిర్మాతలు ఎక్కువగా అతనితో సేఫ్ జోన్ లో సినిమాలు చేసేవారు.

17ఏళ్ళ కెరీర్ లో మొదటిసారి..
ఇక ఈ 17ఏళ్ళ కెరీర్ లో అల్లరోడు మొదటిసారి ఒక ఏడాదిని మిస్ అయ్యాడు. చెప్పాలి అంటే అతను హీరోగా కనిపించి రెండేళ్లు అవుతోంది. 2019లో మహర్షి సినిమాలో ఒక కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఇక 2020లో నాంది, బంగారు బుల్లోడు సినిమలతో హిట్ కొట్టాలని అనుకున్నాడు. కానీ కరోనా దెబ్బకు ఈ ఏడాది మొత్తమే వెండితెరపై కనిపించలేదు. ఇక బంగారు బుల్లోడు 2021 సంక్రాంతికి రాబోతోంది. మరి ఆ సినిమా ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











