అల్లరి నరేష్ ఎమోషనల్: ‘మహర్షి’తో నా లైఫ్ ఫుల్ సర్కిల్ పూర్తయింది!

Recommended Video

Allari Naresh Emotional Tweet,Completed 17 Years In Telugu Cinema || Filmibeat Telugu

అల్లరి నరేష్ ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 17 సంవత్సరాలు పూర్తయింది. 2002లో సరిగ్గా ఇదే రోజు(మే 10) ఆయన నటించిన 'అల్లరి' చిత్రం విడుదలైంది. ఆ సినిమా విజయవంతం కావడంతో దాన్నే తన ఇంటి పేరుగా మార్చుకుని ఇండస్ట్రీలో పాపులర్ స్టార్‌గా ఎదిగిపోయాడు. ఇప్పటి వరకు తన కెరీర్లో 55 సినిమాలు పూర్తి చేశాడు. పలు బ్లాక్ బస్టర్ చిత్రాలు ఖాతాలో వేసుకున్నాడు.

తొలి చిత్రం నుంచి ఇప్పటి వరకు అల్లరి చేసే పాత్రలు, కామెడీ పండించే పాత్రల్లో నటించిన నరేష్ 'మహర్షి' చిత్రంలో విభిన్నమైన రోల్ పోషించారు. ఇప్పటి వరకు ఆయన చేసిన పాత్రలన్నింటికంటే డిఫరెంట్ పాత్రతో, అద్భుతమైన నటనతో ప్రేక్షకులను భావోద్వేగాలకు గురి చేశాడు.

లైఫ్ ఫుల్ సర్కిల్ పూర్తయింది: నరేష్ ఎమోషనల్

లైఫ్ ఫుల్ సర్కిల్ పూర్తయింది: నరేష్ ఎమోషనల్

‘మహర్షి' మూవీతో నా లైఫ్ ఫుల్ సర్కిల్ పూర్తయింది అంటూ నరేష్ తన ట్విట్టర్ పేజీ ద్వారా వెల్లడించారు. తన తొలి చిత్రం ‘అల్లరి'లో రవి అనే పాత్రలో నటించాను, ఇపుడు ‘మహర్షి'లో కూడా రవి అనే పాత్ర చేసే అవకాశం దక్కింది. దీంతో నా నట జీవితంలో ఫుల్ సర్కిల్ పూర్తయినట్లు ఆయన తెలిపారు.

17 ఏళ్ల క్రితం ఇండస్ట్రీకి వచ్చాను

17 ఏళ్ల క్రితం ఇండస్ట్రీకి వచ్చాను

17 ఏళ్ల క్రితం అందరి యువకుల్లానే నా అదృష్టాన్ని వెతక్కుంటూ ఇండస్ట్రీకి వచ్చాను. ఇక్కడ స్టాండ్ అవుతానో లేదో అనే విషయం కూడా నాకు అప్పుడు తెలియదు. అదృష్టం కొద్దీనాకు అన్నీ కలిసి వచ్చాయి, నటుడిగా ఇంత కాలం ప్రయాణం సాగించగలిగాను అని అల్లరి నరేష్ చెప్పుకొచ్చారు.

నటుడిగా జన్మించిన రోజు

నటుడిగా జన్మించిన రోజు

2002 మే 10వ తేదీన ‘అల్లరి' సినిమా ద్వారా నేను నటుడిగా మరో జన్మ ఎత్తాను. ఈ ప్రయాణంలో నాకు సినిమా రంగం నుంచి, ప్రేక్షకుల నుంచి ఎంతో సపోర్ట్ లభించింది. వారి సహాయంతోనే ఇక్కడి వరకు రావడంతో పాటు విజయవంతంగా నా ప్రయాణం కొనసాగిస్తున్నట్లు నరేష్ తెలిపారు.

మీ అందరికీ హృదయ పూర్వక కృతజ్ఞతలు

ఈ ప్రమాణంలో నాకు తోడుగా ఉండటంతో పాటు నాపై నమ్మకం పెట్టిన నిర్మాతలు, దర్శకులు, టెక్నీషియన్స్, అభిమానులకు నా హృదయ పూర్వక కృతజ్ఢతలలు తెలుపుతున్నట్లు నరేష్ ట్వీట్ చేశారు. నరేష్ చేసిన ఈ ట్వీటుపై అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఆయన్న విష్ చేస్తూ పలువురు ఫ్యాన్స్ సందేశాలు పోస్ట్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X