twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ రోజు నరకం అనుభవించా, అన్నయ్యకు నాపై కోపం ఇంకా ఉంది: అల్లరి నరేష్

    |

    Recommended Video

    Allari Naresh Shares His Father Last Days

    ఈవివి దర్శకత్వంలో వచ్చిన 'జంబలకిడి పంబ' తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే ఒక క్లాసిక్ హిట్. అలాంటి సినిమాలను రీమేక్ చేయడం సాధ్యం కాదని, వాటిని మళ్లీ టచ్ చేయకూడదని అంటున్నారు ఈవివి తనయుడు అల్లరి నరేష్. అయితే నాన్నగారు తీసిన 'ఆ ఒక్కటీ అడక్కు', 'అలీ బాబీ అరడజను దొంగలు' సీక్వెల్ చేద్దామనే ఆలోచన ఉందని తెలిపారు.

    ఇండస్ట్రీకి వచ్చి 17 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇటీవల అల్లరి నరేష్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందర్భంగా తన తండ్రి సినిమాలకు సీక్వెల్ తీయడంపై స్పందించారు. కొన్ని సినిమాలకు సీక్వెల్ చేయాలనే ఆలోచన ఉంది. అయితే నాన్నగారి స్థాయిలో కామెడీ పండించగల దర్శకుడు దొరకడం అంత ఈజీ కాదు, దర్శకుడితో పాటు అందుకు సరిపడే కథ దొరికితే తప్పకుండా చేస్తామని నరేష్ తెలిపారు.

    ఆ విషయంలో అన్నయ్యకు నాపై ఇప్పటికీ కోపం ఉంది

    ఆ విషయంలో అన్నయ్యకు నాపై ఇప్పటికీ కోపం ఉంది

    నాన్నకు ఆరోగ్యం బాగోలేదని తెలిసి కూడా నేను షూటింగుకు వెళ్లాను. చివరి రోజు నాన్న దగ్గర ఎందుకు ఉండలేక పోయాను అనే బాధ నాలో ఇప్పటికీ ఉంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ రోజు ‘సీమటపాకాయ్' షూటింగుకు వెళ్లాల్సి వచ్చింది. ఈ విషయంలో అన్నయ్యకు ఇప్పటికీ నాపై కోపం ఉంది. ఎందుకు వెళ్లావు? అని అంటుంటాడు.. అని నరేష్ గుర్తు చేసుకున్నాడు.

    ఆరోజు అందుకే వెళ్లాను

    ఆరోజు అందుకే వెళ్లాను

    ఆ రోజు నేను షూటింగుకు వెళ్లడానికి కారణం మేజర్ కాంబినేషన్ షూటింగ్ జరుగుతుండటమే. మరుసటిరోజు ముఖ్య నటులు జయప్రకాష్ రెడ్డిగారు, ధర్మవరపు సుబ్రహ్మణ్యంగారు యూఎస్ఏ వెళుతున్నారు. మళ్లీ రెండు నెలల వరకు రారు. రెండు మూడు రోజులు అయితే షూటింగ్ పూర్తవుతుంది. మేజర్ కాంబినేషన్. ఆ డేట్ పోతే మళ్లీ రాదు... అందుకే వెళ్లాల్సి వచ్చిందని నరేష్ తెలిపారు.

    ఆ ఒక్కరోజు నరకం అనిపించింది

    ఆ ఒక్కరోజు నరకం అనిపించింది

    ఆరోజు నాన్నకు ఆరోగ్యం బాగోలేదు ఆసుపత్రిలో చేరారని తెలుసు కానీ ఇంత సీరియస్ అవుతుందని తెలియదు. మధ్యహ్నం తర్వాత ఆయన ఆరోగ్యం చాలా సీరియస్ అనే కబురు వచ్చింది. ఈ విషయం తెలిసిన వెంటనే లోపలి నుంచి ఏడుపొచ్చింది. మనసులో అంత బాధ పెట్టుకుని షూటింగులో కామెడీ సీన్ చేసి నవ్వించాలి. నా జీవితంలో అది చాలా కఠినమైన రోజు. అప్పటి సంఘటన గుర్తకు వస్తే నా మీద నాకే కోపం వస్తుంది. ఆ రోజు నాన్నతో లాస్ట్ మినట్లో ఉండాల్సింది కదా అనిపిస్తుంది. నా 17 ఏళ్ల జర్నీలో ఆ ఒక్కరోజు షూటింగ్ నరకం అనిపించిందని నరేష్ తెలిపారు.

    అల్లరి నరేష్

    అల్లరి నరేష్

    కాగా... ఇప్పటి వరకు కామెడీ హీరోగా రాణిస్తూ వచ్చిన అల్లరి నరేష్ ప్రస్తుతం రూటు మార్చాడు. ఇప్పటి ట్రెండుకు తగిన విధంగా సినిమాలు చేస్తూ ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాడు. ఇటీవలే ‘మహర్షి'లో కీలకమైన పాత్రలో తనదైన నటనతో అందరినీ మెప్పించిన నరేష్ ఇకపై తన రోటీన్ సినిమాలకు భిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు.

    English summary
    Allari Naresh Shares His Father Last Days. Allu Naresh participated in the shooting under compulsory circumstances.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X