పాములంటే భయం.. బ్లాక్ బస్టర్ హిట్ మిస్.. అల్లరి నరేష్ ఆసక్తికర కామెంట్స్
ప్రముఖ దర్శకుడు, దివంగత ఈవీవీ సత్యనారాయణ కుమారుడిగా పరిచయం అయ్యాడు అల్లరి నరేష్. మొదటి సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్న ఈ కామేడీ హీరో హాస్య భరిత సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచాడు. కానీ ఇటీవల మాత్రం సీరియస్ కాన్సెప్ట్ చిత్రాలతో మరింతగా మెప్పిస్తున్నాడు. ఇటీవలే తాజాగా ఉగ్రం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి తన నట ఉగ్రరూపాన్ని చూపించాడు. అయితే తనకున్న పాముల భయం వల్ల బ్లాక్ బస్టర్ హిట్ మూవీని మిస్ చేసుకున్నట్లుగా తాజాగా వెల్లడించాడు.
అలాంటి చిత్రాలతో : కామెడీ సినిమాలకు పెట్టింది పేరుగా ప్రత్యేకమైన పాపులారిటీ సంపాందించుకున్నాడు అల్లరి నరేష్. ఈ మధ్య కాలంలో నాంది. ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం వంటి కాన్సెప్ట్ ఒరియెంటెడ్ చిత్రాలతో ప్రేక్షకులను మునుపటికంటే ఎక్కువగా ఆకట్టుకుంటున్నాడు. తనదైన కామెడీ టైమింగ్ తో ఆద్యంతం అలరించిన ఈ హీరో కాన్సెప్ట్ చిత్రాలతో నటనలో సరికొత్త వైవిధ్యం చూపించాడు.

నటనలో తానేంటో : ఇటీవల మరోసారి ఉగ్రం మూవీతో తన నటనేంటో నిరూపించాడు అల్లరి నరేష్. నాంది వంటి సూపర్ హిట్ ఇచ్చిన విజయ్ కనకమేడల దర్శకత్వంలో రెండోసారి అల్లరి నరేష్ నటించిన మూవీ ఉగ్రం. ఈ సినిమాను షైన్ స్క్రీన్ బ్యానర్ లో సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించగా.. నరేష్ కు జోడీగా మిర్నా మీనన్ హీరోయిన్ గా నటించింది.

అల్లరోడి ఉగ్రరూపం : మే 5న విడుదలైన ఉగ్రం సినిమాలో పవర్ ఫుల్, యాంగ్రీ పోలీస్ ఆఫీసర్ గా నరేష్ ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా యాక్షన్స్ సీన్సులలో ఉగ్రరూపం చూపించేశాడు. సినిమా మొత్తం నరేష్ వన్ మ్యాన్ షోగా నిలిచిందని చాలా వరకు పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. అయితే కలెక్షన్ల పరంగా మాత్రం సత్తా చాటలేకపోయాడు.
అధికారిక ప్రకటన: శ్రీ చరణ్ పాకాలా బీజీఎమ్ కు సైతం మంచి పేరు వచ్చింది. ఇక ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ ధరకు కొనుగోలు చేసిందని సమాచారం. అంతేకాకుండా ఈ చిత్రం జూన్ మొదటి వారంలో వచ్చే అవకాశం ఉందని, త్వరలో అధికారికంగా ప్రకటన రావాల్సి ఉందని తెలుస్తోంది.

డైరెక్టర్ ఎంత చెప్పినా : ఇదిలా ఉంటే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అల్లరి నరేష్ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. తనకు కథ నచ్చిన అందులో పాములు ఉండటంతో బాబోయ్ నా వల్ల కాదు అని నో చెప్పాడట ఈ హీరో. అతనికి వ్యక్తిగతంగా పాములు అంటే చాలా భయమట. అందుకే రెజెక్ట్చేసినట్లు తెలిపాడు. డైరెక్టర్ ఒప్పించేందుకు ఎంత ప్రయత్నించినా ఈ అల్లరోడు ససేమిరా అన్నాడట.

సుడిగాడు తర్వాత : ఇంతకీ ఆ సినిమా ఏదంటే యంగ్ హీరో నిఖిల్-చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన కార్తికేయ. కలర్ స్వాతి హీరోయిన్ గా 2014లో వచ్చిన ఈ సినిమా ఎలాంటి హిట్ కొట్టిందో తెలిసిందే. కేవలం రూ. 6 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిని ఈ సినిమా సుమారు రూ. 25 కోట్లు కలెక్ట్ చేసింది. దీనికి సీక్వెల్ కార్తికేయ 2 పాన్ ఇండియా స్థాయిలో హిట్ అందుకుంది. సుడిగాడు సినిమా తర్వాత కార్తికేయ స్టోరీని పాముల భయం కారణంగా నరేష్ రెజెక్ట్ చేసి సాలిడ్ బ్లాక్ బస్టర్ ను కోల్పోవాల్సి వచ్చింది.


Click it and Unblock the Notifications











