బాలయ్య సూపర్ హిట్ టైటిల్‌తో అల్లరి నరేష్!
కామెడీ హీరో అల్లరి నరేష్ నటిస్తున్న ఒకప్పుడు నిర్మాతలకు మినిమం గ్యారెంటీ హీరో. ఇటీవల అల్లరి నరేష్ కు సరైన విజయాలు లేవు. నెమ్మదిగా సక్సెస్ ట్రాక్ ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నాడు. అల్లరి నరేష్ ప్రస్తుతం క్యారెక్టర్ రోల్స్ కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న మహర్షి చిత్రంలో నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
నరేష్ ప్రస్తుతం హీరోగా రెండు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సత్తిబాబు దర్శత్వంలో ఓ చిత్రంలో అల్లరి నరేష్ నటిస్తున్నాడు. మరోవైపు గిరి అనే డెబ్యూ దర్శకుడికి కూడా నరేష్ ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం గురించి ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది. నందమూరి బాలయ్య సూపర్ హిట్ చిత్రం బంగారు బుల్లోడు టైటిల్ ని ఈ చిత్రాన్ని పరిశీలిస్తున్నారట.

కథ పరంగా ఈ చిత్రానికి బంగారు బుల్లోడు అనే టైటిల్ యాప్ట్ అవుతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. 1993లో వచ్చిన బాలయ్య బంగారు బుల్లోడు చిత్రం ఘనవిజయం సాధిచింది. ఇటీవల పాత చిత్రాల టైటిల్స్ ఇటీవల చాలా చిత్రాల్లో రిపీట్ చేస్తున్నారు. సుందరకాండ, యముడికి మొగుడు లాంటి పాత టైటిల్స్ ని అల్లరి నరేష్ ఇప్పటికే రిపీట్ చేశాడు. అల్లరి నరేష్ ఈ ప్రయోగం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











