4 రోజుల్లో 500 సిగరెట్స్ తాగిన అల్లరి నరేష్.. ఆరోగ్య పరిస్థితి ఏంటంటే?

ప్రముఖ దర్శకుడు, దివంగత ఈవీవీ సత్యనారాయణ కుమారుడిగా హీరోగా పరిచయం అయ్యాడు అల్లరి నరేష్. మొదటి సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు ఈ కామేడీ హీరో. హాస్య భరిత సినిమాలతో విశేషమైన గుర్తింపు సంపాదించుకున్న అల్లరి నరేష్ ప్రస్తుతం కాలంలో విభిన్నమైన చిత్రాలు చేస్తూ మరింతగా క్రేజ్ సంపాదించుకుంటున్నాడు. ఆయన తాజాగా నటించిన చిత్రం ఉగ్రం. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు నరేష్. ఈ క్రమంలోనే ఆయన 4 రోజుల్లో 500 సిగరెట్స్ తాగినట్లు షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చాడు.

సరికొత్త వైవిధ్యం:కామెడీ సినిమాలకు పెట్టింది పేరుగా ప్రత్యేకమైన పాపులారిటీ సంపాందించుకున్నాడు అల్లరి నరేష్. ఈ మధ్య కాలంలో నాంది. ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం వంటి కాన్సెప్ట్ ఒరియెంటెడ్ చిత్రాలతో ప్రేక్షకులను మునుపటికంటే ఎక్కువగా ఆకట్టుకుంటున్నాడు. తనదైన కామెడీ టైమింగ్ తో ఆద్యంతం అలరించిన ఈ హీరో ఈ చిత్రాల్లో నటనలో సరికొత్త వైవిధ్యం చూపించాడు.

Allari Naresh Says He Smoke 500 Cigarettes In 4 Days For Ugram Movie

హీరోయిన్ గా మీనన్:ఇప్పుడు మరోసారి తన నటనతో అట్రాక్ట్ చేసేందుకు ఉగ్రం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. నాంది వంటి సూపర్ హిట్ ఇచ్చిన విజయ్ కనకమేడల దర్శకత్వంలో మరోసారి అల్లరి నరేష్ నటించిన చిత్రమే ఉగ్రం. దీంతో ఈ సినిమాపై మంచి అంచనాలనే నెలకొన్నాయి. ఈ సినిమాను సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు. ఇందులో నరేష్ కు జోడీగా మిర్నా మీనన్ హీరోయిన్ గా నటించింది.

Allari Naresh Says He Smoke 500 Cigarettes In 4 Days For Ugram Movie

కిడ్నాప్ నేపథ్యం:షేన్ స్క్రీన్ బ్యానర్ లో నిర్మించిన ఉగ్రం సినిమా మే 5న విడుదల కానుంది. ఈ సినిమాలో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది కిడ్నాప్ కు గురి కావడం, ఆ ముఠాను పట్టుకునేందుకు పోలీస్ ఆఫీసర్ ఎదుర్కొన్న ఇబ్బందులు తదితర అంశాలతో క్రైమ్ థ్రిల్లర్ తరహాలో ఈ సినిమా ఉండనుందని మూవీ ట్రైలర్ ను చూస్తే అర్థం అవుతోంది.

Allari Naresh Says He Smoke 500 Cigarettes In 4 Days For Ugram Movie

కామెడీ పోలీసుగా:అయితే ఇంతకుముందు కితకితలు సినిమాలో కామెడీ పోలీసుగా సందడి చేసిన అల్లరి నరేష్ ఉగ్రం మూవీలో పవర్ ఫుల్ పోలీసుగా సత్తా చాటనున్నాడని తెలుస్తోంది. ఎందుకంటే ఇదివరకు వదిలిన టీజర్, ట్రైలర్, గ్లింప్స్ వదిలి ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే ఓ ఇంటర్వ్యూలో అల్లరి నరేష్ పాల్గొని ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

Allari Naresh

ఒక్క సీన్ కోసం:ఉగ్రం సినిమాలో ఓ యాక్షన్ సీన్ చిత్రీకిరిస్తున్నారు. అది కూడా నైట్ టైమ్ లో ఫైట్ సన్నివేశాన్ని షూట్ చేస్తున్నారు. ఈ సన్నివేశంలో నరేష్ సిగరెట్ కాలుస్తూ నటించాలి. ఈ ఫైట్ ను నాలుగు రోజుల పాటు చిత్రీకరించారు. ఈ సీన్ కోసమే నరేష్ సిగరెట్స్ కాలుస్తూ నటించారు. అయితే ఈ ఫైట్ సీన్ కంప్లీట్ అయ్యేలోపు దాదాపు 500 సిగరెట్స్ తాగేశారట నరేష్. దీంతో ఆ తర్వాతి రోజు దగ్గుతో బాధపడ్డారట. అయిన కానీ దగ్గుతోనే చిత్రీకరణలో పాల్గొనాల్సి వచ్చిందని, ప్రస్తుతం బాగానే ఉన్నట్లు నరేష్ చెప్పుకొచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X