బచ్చలమల్లి గుర్తుండిపోయేలా ఉన్నాడే .. అల్లరోడికి సరైన బొమ్మ దొరికిందా?

అల్లరి నరేష్.. ఇతని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ కుమారుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నరేష్ ఒకప్పుడు సంవత్సరానికి నాలుగైదు సినిమాలతో సందడి చేసేవాడు. ఈ జనరేషన్‌లో అంత వేగంగా సినిమాలు చేసిన నటుడు మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. నటకిరిటీ డాక్టర్ రాజేంద్రప్రసాద్ తర్వాత కామెడీతో హీరోగా నిలదొక్కుకున్న వ్యక్తి నరేష్. కానీ ఏమైందో ఏమో కానీ నరేష్ మనుపటి స్పీడ్ కంటిన్యూ చేయలేకపోతున్నాడు. సినిమాలు ఒకదానికొకటి ఫ్లాప్ అవుతుండటంతో ఆయన కెరీర్‌ డౌన్‌ఫాల్ అయ్యింది.

కామెడీని పండిస్తూనే సీరియస్ పాత్రలు చేస్తూ తనలో మంచి నటుడున్నాడని ప్రూవ్ చేసుకున్నాడు. గమ్యం, నాంది, మహర్షి , ఉగ్రం, మారేడుమిల్లి ప్రజానీకం వంటి సినిమాలు నరేష్‌కు మంచి పేరు తీసుకొచ్చాయి. కానీ తన స్థాయికి తగ్గ హిట్ అందుకుని చాలా రోజులైంది. ఇటీవల నరేష్ నటించిన '' ఆ ఒక్కటి ఆడక్కు '' సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఫస్ట్‌లుక్, పోస్టర్లు, టీజర్, ట్రైలర్లకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో అల్లరోడు ట్రాక్‌లోకి వచ్చినట్లేనని అంతా అనుకున్నారు. గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను జరుపుకోవడంతో పాటు రూ.4 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ దక్కించుకుంది.

allari naresh trying different role and new story in Bachalamalli

కానీ రిలీజయ్యాక మిక్స్‌డ్ టాక్‌తో పెద్దగా వర్కవుట్ అయినట్లు కనిపించలేదు. ఇందులో ఫరియా అబ్ధుల్లా హీరోయిన్‌గా నటించగా.. వెన్నెల కిషోర్, అరియానా గ్లోరీ, హర్ష, హరితేజ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఆ ఒక్కటీ ఆడక్కు రిజల్ట్‌ తేడా కొట్టినా నిరుత్సాహపడకుండా సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు నరేష్. మన ప్రయత్నం మనం చేస్తే ఏదో ఒకరోజూ హిట్ గ్యారెంటీ అన్న సూత్రాన్ని నమ్మి ముందుకు సాగుతున్నాడు. అందుకు అనుగుణంగానే తనకు నటుడిగా గుర్తింపు తెచ్చిన సీరియస్ పాత్రలవైపు ఆయన దృష్టిపెట్టినట్లుగా కనిపిస్తోంది. దీనిలో భాగంగా నరేష్ చేస్తున్న లేటెస్ట్ మూవీ ''బచ్చల మల్లి ''.

ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ మంగళవారం విడుదల చేసింది. పెరిగిన గడ్డం, సీరియస్ లుక్‌తో రిక్షా మీద కూర్చొని సిగరెట్ తాగుతున్న నరేష్ లుక్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. బ్యాక్‌గ్రౌండ్‌లో దేవుళ్ల వేషాలు వేసిన జనం, బాణాసంచా కాల్పులు కనిపిస్తున్నాయి. పేరు మల్లి.. ఇంటిపేరు బచ్చల.. చేసేది ట్రాక్టర్ డ్రైవర్.. ఈ బచ్చలమల్లి కచ్చితంగా మీకు చాలా రోజులు గుర్తుండిపోతాడు అంటూ మేకర్స్ చెప్పుకొచ్చారు.

1990వ దశకంలోని సంఘటనల ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తున్నారని ఫిలింనగర్ టాక్. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతోంది. బచ్చలమల్లిలో అల్లరి నరేష్ సరసన అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. రోహిణి, రావు రమేష్, అచ్యుత్ కుమార్, బలగం జయరాం, హరితేజ, ప్రవీణ్, వైవా హర్ష తదితరులు కీలకపాత్ర పోషిస్తున్నారు. అంతేనా సీతారామం మూవీకి స్వరాలు అందించిన విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ డైరెక్టర్‌. సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు ''బచ్చలమల్లి''కి దర్శకత్వం వహిస్తుండగా.. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుప్తా నిర్మిస్తున్నారు.

తనకు హిట్ ఎందుకు దొరకదో ఈసారి తాడో పేడో తేల్చుకోవాలని నరేష్ కసిగా కనిపిస్తున్నాడు. పరమ మొరటుపాత్రలో తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించేందుకు ఆయన సిద్ధమవుతున్నాడు. టాప్ టెక్నీషియన్స్ కూడా జత కలవడంతో బచ్చలమల్లి చాలా కాలం గుర్తుండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X