మహేష్ బాబు ‘మహర్షి’లో నరేష్ పాత్ర ఇదేనా? ట్వీట్ ద్వారా లీక్ చేసిన అల్లరోడు!
Recommended Video

మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రానికి 'మహర్షి' అనే టైటిల్ ఖరారు చేస్తూ సూపర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్, టీజర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరో అల్లరి నరేష్ కూడా కీలకమైన పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాలో మహేష్ స్నేహితుడిగా నరేష్ కనిపించబోతున్నాడు.

తాజాగా మహేష్ బాబుకు బర్త్ డే విషెస్ తెలుపుతూ నరేష్ చేసిన ట్వీట్... అతడి పాత్ర ఏమిటో రివీల్ చేసింది. ఈ చిత్రంలో నరేష్ 'రవి' అనే పాత్రలో కనిపించబోతున్నట్లు అతడు చేసిన ట్వీట్ బట్టి స్పష్టమవుతోంది.
కామెడీ హీరోగా సినిమాలు చేస్తూనే... అప్పుడప్పుడూ నరేష్ మంచి కంటెంట్ ఉన్న సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తున్నారు. గతంలో అతడు 'గమ్యం', 'శంభో శివ శంభో' సినిమాల్లో చేసిన పాత్రలకు మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పటి వరకు నరేష్ చేసిన పాత్రలను మించి పోయేలా 'మహర్షి'లో అతడు పోషించిన రవి రోల్ ఉంటుందని అంటున్నారు.
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానకి కేయూ మోహనన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. వంశీపైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వై జయంతి మూవీస్, పివిపి సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. డెహ్రాడూన్, హైదరాబాద్, గోవాలలో ఇప్పటికే షూటింగ్ షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.... 2019 ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











