అల్లరి నరేష్ నాంది లేటెస్ట్ అప్డేట్.. ఈసారైనా హిట్టు కొడతాడా?
టాలీవుడ్ లో కొన్నాళ్లపాటు మినిమామ్ గ్యారెంటి హీరోగా తనకంటూ ఒక బ్రాండ్ సెట్ చేసుకున్న హీరో నరేష్. ఒకప్పుడు అల్లరోడు ఏడాదికి రెండు మూడు సినిమాలు అయినా విడుదల చేసేవాడు. కానీ ప్రస్తుతం ఏడాది గడిచినా కూడా కనీసం తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ కూడా ఇవ్వడం లేదు. గత కొన్నాళ్లుగా ఒక్క సినిమాను కూడా రిలీజ్ చేయడం లేదు. వరుస డిజాస్టర్స్ ఎదురవ్వడంతో చాలా వరకు కమర్షియల్ సినిమాలను చేయకూడదని నరేష్ ఫిక్స్ అయ్యాడు.
అందుకే నెక్స్ట్ ఆడియెన్స్ కి సరికొత్త కిక్కివ్వాలని ఒక వినూత్న థ్రిల్లర్ సినిమాతో రాబోతున్నాడు. అందులో మంచి సందేశం కూడా ఉందట. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో తుది దశకు చేరుకున్న నాంది ప్రస్తుతం సినిమా డబ్బింగ్ పనుల్లో బిజీగా ఉంది. అల్లరి నరేష్ సోమవారం డబ్బింగ్ కూడా మొదలు పెట్టాడు. వీలైనంత త్వరగా సినిమాకు సంబంధించిన ఒక స్పెషల్ టీజర్ విడుదల చేయాలనే కారణంగా ప్రీ ప్రొడక్షన్ పనిలో స్పీడ్ పెంచినట్లు తెలుస్తోంది.

విజయ్ కనమేడలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నాంది'చిత్రంలో అల్లరి నరేష్ ఎప్పుడు చూడని ఒక ప్రయోగాత్మక పాత్రలో కనిపించబోతున్నాడు. సినిమా ఫస్ట్ లుక్ తోనే జనాలను ఆకట్టుకున్నాడు. అయితే ఈ సినిమాతో హిట్టు కొట్టడం గ్యారెంటీ అని చిత్ర యూనిట్ చెబుతోంది. నరేష్ పాత్రలో కనిపించే షేడ్స్ ఆడియెన్స్ ని థ్రిల్ చేస్తాయని అంటున్నారు. మరి అల్లరి నరేష్ ఏ స్థాయిలో సక్సెస్ అందుకుంటాడో చూడాలి. ఇక అక్టోబర్ లో పరిస్థితిని బట్టి ఈ సినిమాను రిలీజ్ చేయాలని నిర్మాతలు ఆలోచిస్తున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











