10కాకపోతే 15కోట్లు తీసుకో.. అల్లు అర్జున్ కోసం స్టార్ డైరెక్టర్‌కి భారీ ఆఫర్!

టాలీవుడ్ స్టార్ హీరోలు ఇటీవల కాలంలో స్టార్ దర్శకులతో ఎక్కువగా సినిమాలు చేస్తున్నారు. మార్కెట్ పెరుగుతుండడంతో నిర్మాతలు కూడా కొత్త దర్శకులను స్టార్ హీరోలను అంత ఈజీగా కలపడం లేదు. వీలైనంత వరకు కమర్షియల్ సినిమాలతో ప్రాఫిట్స్ అంధించే దర్శకులను సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఇక ఇటీవల అల్లు అరవింద్ తన కొడుకు కోసం ఒక స్టార్ డైరెక్టర్ కి భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేశాడట.

అల్లు అర్జున్ రికార్డ్స్..

అల్లు అర్జున్ రికార్డ్స్..

అల్లు అర్జున్ ఇటీవల అల.. వైకుంఠపురంలో సినిమాతో సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమాతో అల్లు అర్జున్ కూడా తనకు 200కోట్ల మార్కెట్ ఉందని నిరూపించుకున్నడు. చాలా ఏరియాల్లో ఆ సినిమా గత సినిమాల బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. నాన్ బాహుబలి రికార్డులను కూడా బ్రేక్ చేసిందని కూడా కథనాలు వెలువడ్డాయి.

సోలో హిట్టు కోసం..

సోలో హిట్టు కోసం..

కొడుకు మార్కెట్ పెరగడంతో నిర్మాత అల్లు అరవింద్ ఇక నుంచి బిగ్ బడ్జెట్ సినిమాలు ఎక్కువగా తీయాలని డిసైడ్ అయ్యారట. కొడుకుతో సోలోగా ఒక కమర్షియల్ సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అల.. వైకుంఠపురములో సినిమాకు నిర్మాత అయినప్పటికీ హరికా హాసిని సంస్థతో కలిసి సినిమాను నిర్మించిన అల్లు అరవింద్ ఈ సారి సింగిల్ గానే గీత ఆర్ట్స్ స్థాయి పెంచేలా బన్నీతో సినిమా నిర్మించనున్నారట.

కొరటాలకు భారీ ఆఫర్..

కొరటాలకు భారీ ఆఫర్..

ప్రస్తుతం కొరటాల శివ ఫెయిల్యూర్ లేని దర్శకుడిగా టాప్ హీరోలతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. చిరంజీవి ఆచార్య సెట్స్ పై ఉండగానే అల్లు అరవింద్ కొరటాలకు భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. దర్శకుడు 10కోట్ల వరకు రెమ్యునరేషన్ అంటూ చర్చలు జరపగా.. 10కాకపోతే 15కోట్లు తీసుకో గాని అల్లు అర్జున్ తో మంచి సినిమా తీయాలని అల్లు అరవింద్ ఒక డీల్ సెట్ చేసుకున్నారట.

Recommended Video

Chiranjeevi Had A Meeting With Talasani Srinivas Yadav About TFI Future Plans
పుష్ప అయిపోగానే..

పుష్ప అయిపోగానే..

చర్చల అనంతరం అల్లు అరవింద్ కొరటాల శివ పారితోషికాన్ని 13కోట్లకు ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ పాన్ ఇండియా సినిమా పుష్పతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ సినిమా అయిపోగానే తన కొడుకుతో సినిమాను స్టార్ట్ చేయాలని కొరటాలతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారట అల్లు అరవింద్. మరి ఈ కాంబినేషన్ ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X