గీత గోవిందం తరహాలో.. యువ హీరోతో అల్లు అరవింద్ ప్లాన్!
గీత గోవిందం చితం హిట్ అవుతుందని అంతా భావించారు. కానీ బాక్సాఫీస్ లెక్కలు తిరగరాసే హిట్ అవుతుందని ఎవరూ భావించలేదు. ఆ స్థాయిలో గీత గోవిందం చిత్రం దుమ్ములేపింది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన మందన కలసి నటించిన ఈ చిత్రం అద్భుత విజయాన్ని అందుకుంది. ప్రఖ్యాత గీత ఆర్ట్స్ బ్యానర్ లో ఈ చిత్రం రూపుదిద్దుకున్న సంగతి తెలిసిందే.
అదే తరహాలో అల్లు అరవింద్ మరో ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. యంగ్ హీరో నాగశౌర్యతో ఓ చిత్రాన్ని నిర్మించాలని అల్లు అరవింద్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీరి మధ్య చర్చలు మొదలైనట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఓ రొమాంటిక్ స్టోరీ రెడీ చేయించి, యువ దర్శకుడితో తక్కువ బడ్జెట్ లో ఈ చిత్రాన్ని పూర్తి చేయాలని అల్లు అరవింద్ భావిస్తున్నారట.

గీత ఆర్ట్స్ బ్యానర్ లోనే ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. నాగశౌర్య ఇటీవల నర్తనశాల చిత్రంతో పరాజయాన్ని చవిచూశాడు.


Click it and Unblock the Notifications











