twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Allu Arjun: గణేష్ నిమజ్జనం వేడుకలో అల్లు అర్జున్.. కూతురితో కలిసి సందడిగా.. ఫొటోస్ వైరల్

    |

    టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఎంతో స్టైలిష్ గాను అలాగే సింపుల్ గాను ఉండే హీరోలలో అల్లు అర్జున్ టాప్ ప్లేస్ లో ఉంటాడు అని చెప్పవచ్చు. అతను ఒక మంచి ఫ్యామిలీ మ్యాన్ గా కూడా గుర్తింపును అందుకున్నాడు. అయితే ఇటీవల గణేష్ చతుర్దతి సందర్భంగా అల్లు అర్జున్ ప్రత్యేకంగా తన ఆఫీసులో వినాయకుడిని కూడా ప్రతిష్టించాడు. ఇక రోజు ప్రత్యేకంగా తన కుటుంబంతో కలిసి పూజలు చేసుకుంటూ వచ్చిన అల్లు అర్జున్ ఇప్పుడు నిమజ్జనం వేడుకల్లో కూడా పాల్గొన్నాడు.

    ప్రతి ఏడాది తన సన్నిహితులతో అలాగే స్టాఫ్ నెంబర్స్ తో కలిసి అల్లు అర్జున్ ఈ సెలబ్రేషన్స్ లో పాల్గొంటూ ఉంటాడు. ఇక ఈసారి కూతురిని కూడా ఈ సెలబ్రేషన్స్ లో భాగమయ్యేలా చేశాడు. వీరిద్దరూ ప్రత్యేకంగా గణేష్ నిమజ్జనంలో వినాయకుడిని దర్శించుకుంటూ చాలా బాగా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఊరేగింపులో భాగంగా అల్లు అర్జున్ మొదటి గణనాథుడిని సాగనంపేందుకు కొబ్బరికాయ కొట్టాడు. అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

    Allu Arjun and his staff bid adieu to Lord Ganesh,

    ఇంట్లో ఎలాంటి పండగ వాతావరణం నెలకొన్నా కూడా తన స్టాఫ్ మెంబెర్స్ తో కూడా చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకునే అల్లు అర్జున్ ఎంత పాజిటివ్ గా ఉంటాడో మరోసారి అర్థమయింది. ఇక అల్లు అర్జున్ తన కూతురుని ఎత్తుకున్న ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతొంది.

    Allu Arjun and his staff bid adieu to Lord Ganesh,

    ఇక సినిమాల విషయానికి వస్తే అల్లు అర్జున్ నెక్స్ట్ పుష్ప సెకండ్ పార్ట్ తో బిజీ కానున్నాడు. ఇటీవల పూజా కార్యక్రమాలతో మొదలైన ఆ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ కూడా త్వరలోనే మొదలు కాబోతోంది. వీలైనంత త్వరగా సినిమా షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారు. అలాగే చర్చల దశలో కూడా మరో రెండు ప్రాజెక్టులు ఉన్నాయి.. ఒక బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు తో కూడా అల్లు అర్జున్ సినిమా చేసేందుకు సంప్రదింపులు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.

    English summary
    Allu Arjun and his staff bid adieu to Lord Ganesh,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X