మహేష్ బాబుకి షాకిచ్చిన అల్లు అర్జున్.. 13 నెలల రికార్డు బద్దలు.. మహేష్ ఎన్నో స్థానం అంటే?

టాలీవుడ్ లో ఎవరు నెంబర్ వన్ అంటే ఇప్పుడు ఉన్న అందరి హీరోల అభిమానులు కూడా ఇంకేముందు మా హీరో నెంబర్ 1 అంటే మా హీరో నెంబర్ 1 అంటారు. నిజానికి ఈ విషయం ఎప్పటికీ ఎడతెగని ఒక పెద్ద చిక్కు ప్రశ్న. కానీ ఇండియాలోనే మోస్ట్ పాపులర్ సర్వే కంపెనీ ఆర్మాక్స్ మీడియా ప్రతి నెల మోస్ట్ పాపులర్ తెలుగు స్టార్స్ సర్వే నిర్వహిస్తోంది. సోషల్ మీడియాలో, మీడియాలో ఎవరికీ ఎక్కువ క్రేజ్ ఉంది? ఎవరి గురించి చర్చ జరిగింది అనే అంశాలను పరిగణలోకి తీసుకుని ఒక లిస్ట్ విడుదల చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ సర్వే జనవరి 2022 నెలకు సంబంధించిన ఫలితాలు విడుదలయ్యాయి. ఆ జాబితాలో చాలా స్థానాలు మారాయి. ఎవరెవరి పొజిషన్స్ మారాయి అనే వివరాల్లోకి వెళితే

1అల్లు అర్జున్ మహేష్ 2-ఎన్టీఆర్

1అల్లు అర్జున్ మహేష్ 2-ఎన్టీఆర్

పాపులర్ సర్వ్ కంపెనీ ఆర్మాక్స్ మీడియా మోస్ట్ పాపులర్ తెలుగు స్టార్స్ కేటగిరీలో ఏడాది పాటు ఏకాచక్రాదిపత్యం సాధించిన మహేష్ బాబుని కాదని మొదటి స్థానాని అల్లు అర్జున్ వశం చేసుకునాడు. పుష్ప సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల్లు అర్జున్ సూపర్ హిట్ అందుకున్నాడు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ బాషలలో కూడా సత్తా చాటాడు. ఇండియా మొత్తం ఆయన గురించి చర్చ నడవడంతో మొదటి స్థానానికి చేరుకున్నాడు. ఇక ఎన్టీఆర్ ఐదవ స్థానం నుంచి ఏకంగా రెండో స్థానానికి ఎగబాకారు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో ఆయన రామ్ చరణ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఈ సినిమా సినిమా సంక్రాంతికి రావాల్సి ఉంది కానీ వాయిదా పడింది. తర్వాత ఆయన కొరటాల శివ డైరెక్షన్ లో ఒక సినిమా చేయనున్నారు.

3-ప్రభాస్ 4- మహేష్ బాబు

3-ప్రభాస్ 4- మహేష్ బాబు

ఇక గత నెలలో మూడో స్థానంలో ఉన్న ప్రభాస్ మళ్ళీ మూడవ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. చివరిగా సాహో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ ఇప్పుడు రాధేశ్యామ్ అనే సినిమాతో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది కానీ వాయిదా పడింది. ఇవి కాక ఆదిపురుష్, ప్రాజెక్ట్ కే, సలార్, స్పిరిట్ సినిమాలతో ప్రభాస్ బిజీ బిజీగా వరుసగా పన్నెండు నెలల నుంచి మొదటి స్థానంలో ఉంటున్న మహేష్ ఈ సారికి నాలుగో స్థానానికి పడిపోయారు. చివరిగా సరిలేరు నీకెవ్వరు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ఇప్పుడు పరశురాం దర్శకత్వం వహిస్తున్న సర్కారు వారి పాట అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కావలసి ఉండగా మే నెలకు వాయిదా పడింది.

5-రామ్ చరణ్ 6-పవన్ కళ్యాణ్

5-రామ్ చరణ్ 6-పవన్ కళ్యాణ్

ఇక ఈ జాబితాలో రామ్ చరణ్ ఆరో స్థానం నుంచి ఐదవ స్థానానికి ఎగబాకారు. చివరిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వినయ విధేయ రామ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ అనే సినిమా చేస్తున్నారు. సినిమా సంక్రాంతికి రావాల్సి ఉంది కానీ వాయిదా పడింది. అలాగే ఆచార్య లో కూడా ఆయన నటిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 4న రావాల్సి ఉంది కానీ మళ్ళీ వాయిదా పడింది. ఇక ఈ జాబితాలో పవన్ కళ్యాణ్ నాలుగో స్థానం నుంచి ఆరో స్థానానికి పడిపోయారు. వకీల్ సాబ్ సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చిన ఆయన ప్రస్తుతం వరుస సినిమాలు ఒప్పుకున్నారు. సాగర్ కే చంద్ర దర్శకత్వంలో భీమ్లా నాయక్ సినిమా సంక్రాంతికి రావాల్సి ఉంది కానీ వాయిదా పడి ఫిబ్రవరి 25న వస్తోంది. క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు, హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో సినిమాలు మాత్రం సెట్స్ మీద ఉన్నాయి.

 7-విజయ్ దేవరకొండ 8-నాని

7-విజయ్ దేవరకొండ 8-నాని

ఈ జాబితాలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఎనిమిదవ స్థానం నుంచిఏడవ స్థానానికి ఎగబాకారు. చివరిగా వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ దేవరకొండ ఇప్పుడు పూరి జగన్నాధ్ దర్శకత్వంలో లైగర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. నేచురల్ స్టార్ నాని ఏడవ స్థానం నుంచి ఎనిమిదవ స్థానానికి దిగజారారు. చివరిగా శ్యామ్ సింగరాయ్ సినిమాతో డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన అంటే సుందరానికి అనే సినిమా చేస్తున్నారు. అది కూడా విడుదలకు సిద్దంగా ఉంది.

9- చిరంజీవి, 10-రవితేజ

9- చిరంజీవి, 10-రవితేజ

ఇక మెగాస్టార్ చిరంజీవి ఈ జాబితాలో తన స్థానాన్నీ నిలబెట్టుకున్నారు. చివరిగా ఆయన సైరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఆయన ఆచార్య అనే సినిమాలో హీరోగా నటించగా ఆ సినిమా ఫిబ్రవరి నెలలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అయింది, కానీ మళ్ళీ ఏప్రిల్ నెలకు వాయిదా వేశారు. అదొక్క సినిమా కాకుండా చిరంజీవి మరో నాలుగు సినిమాలు కూడా లైన్ లో పెట్టారు. ఇక నాగ చైతన్య ఈ జాబితాలో స్థానం సంపాదించారు. చివరిగా లవ్ స్టోరీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన వరుస సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే థాంక్యూ సినిమా షూట్ పూర్తి చేయగా ఆమెజాన్ ప్రైమ్ కోసం ధూత అనే వెబ్ సిరీస్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X