తెలుగులో నెం.1 అల్లు అర్జున్.. టాప్ 2కి చేరిన ప్రభాస్.. సర్వేలో వెల్లడైన ఆసక్తికర విషయాలు!

టాలీవుడ్ లో ఎవరు నెంబర్ వన్ అంటే ఇప్పుడు ఉన్న అందరి హీరోల అభిమానులు కూడా మా అభిమాన హీరో నెంబర్ వన్ అంటే మా అభిమాన హీరో నెంబర్ వన్ అని చెప్పుకుంటూ ఉంటారు. ఇండియాలో మోస్ట్ పాపులర్ సర్వే కంపెనీ ఆర్మాక్స్ మీడియా ప్రతి నెల మోస్ట్ పాపులర్ తెలుగు స్టార్స్ సర్వే నిర్వహిస్తోంది. సోషల్ మీడియాలో, మీడియాలో ఎవరికీ ఎక్కువ క్రేజ్ ఉంది? ఎవరి గురించి చర్చ జరిగింది అనే అంశాలను పరిగణలోకి తీసుకుని ఒక లిస్ట్ విడుదల చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ సర్వే ఫిబ్రవరి 2022 నెలకు సంబంధించిన ఫలితాలు విడుదలయ్యాయి. ఆ జాబితాలో కొన్ని స్థానాలు మారాయి. ఎవరెవరి పొజిషన్స్ మారాయి అనే వివరాల్లోకి వెళితే

1-అల్లు అర్జున్ 2-ప్రభాస్

1-అల్లు అర్జున్ 2-ప్రభాస్

పాపులర్ సర్వే కంపెనీ ఆర్మాక్స్ మీడియా మోస్ట్ పాపులర్ తెలుగు స్టార్స్ కేటగిరీలో ఏడాది పాటు ఏక చక్రాధిపత్యం సాధించిన మహేష్ బాబుని కాదని మొదటి స్థానాన్ని జనవరి నెలకు గాను అల్లు అర్జున్ వశం చేసుకున్నాడు. ఇప్పుడు ఫిబ్రవరి నెలలో కూడా ఆయన ఆ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. పుష్ప సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల్లు అర్జున్ సూపర్ హిట్ అందుకున్నాడు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా సత్తా చాటాడు. ఇండియా మొత్తం ఆయన గురించి చర్చ నడవడంతో మొదటి స్థానానికి చేరుకున్నాడని అంచనా. జనవరిలో మూడో స్థానంలో ఉన్న ప్రభాస్ ఈ నెలలో రెండో స్థానానికి ఎగబాకారు. కొద్ది రోజుల క్రితమే రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ ఆ సినిమాతో డివైడ్ టాక్ అందుకున్నారు. ఇవి కాక ఆదిపురుష్, ప్రాజెక్ట్ కే, సలార్, స్పిరిట్ సినిమాలతో ప్రభాస్ బిజీ బిజీగా ఉన్నారు.

3-మహేష్ బాబు 4- పవన్ కళ్యాణ్

3-మహేష్ బాబు 4- పవన్ కళ్యాణ్

వరుసగా పన్నెండు నెలలు మొదటి స్థానంలో ఉంటూ వచ్చిన మహేష్ జనవరిలో నాలుగో స్థానానికి పడిపోగా ఫిబ్రవరి నెల కాస్త కోలుకుని మూడో స్థానానికి చేరారు. చివరిగా సరిలేరు నీకెవ్వరు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ఇప్పుడు పరశురాం దర్శకత్వం వహిస్తున్న సర్కారు వారి పాట అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కావలసి ఉండగా మే నెలకు వాయిదా పడింది. ఇక ఈ జాబితాలో పవన్ కళ్యాణ్ జనవరి నెలలో ఆరో స్థానంలో ఉండగా అక్కడి నుంచి నాలుగో స్థానానికి ఎగబాకారు. వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన ఆయన చివరిగా భీమ్లా నాయక్ సినిమాతో పలకరించారు. ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది కానీ కలెక్షన్స్ లో వెనుక పిండి. ఇక ఆయన క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు, హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో సినిమాలు చేస్తున్నారు.

5-ఎన్టీఆర్ 6-రామ్ చరణ్

5-ఎన్టీఆర్ 6-రామ్ చరణ్


ఇక జనవరిలో రెండో స్థానంలో ఉన్న ఎన్టీఆర్ ఫిబ్రవరి నెలలో మాత్రం ఐదో స్థానానికి దిగజారారు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో RRR అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో ఆయన రామ్ చరణ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఈ సినిమా సినిమా సంక్రాంతికి రావాల్సి ఉంది కానీ వాయిదా పడింది. ఈ సినిమా తర్వాత ఆయన కొరటాల శివ డైరెక్షన్ లో ఒక సినిమా చేయనున్నారు. ఇక జనవరి జాబితాలో రామ్ చరణ్ ఐదో స్థానంలో ఉండగా ఇప్పుడు ఆరో స్థానానికి దిగజారారు. చివరిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వినయ విధేయ రామ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో RRR అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతికి రావాల్సి ఉంది కానీ వాయిదా పడింది. అలాగే ఆచార్యలో కూడా ఆయన నటిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 4న రావాల్సి ఉంది కానీ మళ్ళీ వాయిదా పడింది. .

7-విజయ్ దేవరకొండ 8-నాని

7-విజయ్ దేవరకొండ 8-నాని


జనవరి జాబితాలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నుంచి ఏడవ స్థానం నుంచి ఎనిమిదో స్థానానికి దిగజారారు. చివరిగా వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ దేవరకొండ ఇప్పుడు పూరి జగన్నాధ్ దర్శకత్వంలో లైగర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. జనవరి నెలలో ఎనిమిదో స్థానంలో ఉన్న నేచురల్ స్టార్ నాని ఏడవ స్థానానికి ఎగబాకారు. చివరిగా శ్యామ్ సింగరాయ్ సినిమాతో డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన అంటే సుందరానికి అనే సినిమా చేస్తున్నారు. ఆ సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది.

Recommended Video

Tollywood Stars Top 10 Rankings : Prabhas మూడు.. Allu Arjun రెండు || Filmibeat Telugu
9- చిరంజీవి, 10-రవితేజ

9- చిరంజీవి, 10-రవితేజ

ఇక మెగాస్టార్ చిరంజీవి ఈ జాబితాలో తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. చివరిగా ఆయన సైరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఆయన ఆచార్య అనే సినిమాలో హీరోగా నటించగా ఆ సినిమా ఫిబ్రవరి నెలలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అయింది, కానీ మళ్ళీ ఏప్రిల్ నెలకు వాయిదా వేశారు. అదొక సినిమా కాకుండా చిరంజీవి మరో నాలుగు సినిమాలు కూడా లైన్ లో పెట్టారు. ఈ జాబితాలో రవితేజ కూడా తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. చివరిగా ఖిలాడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ఇప్పుడు రామారావు అన్ డ్యూటీ, ధమాకా వంటి సినిమాల్లో నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X