ప్లాప్ దర్శకుడితో బన్నీ న్యూ మూవీ.. 12 ఏళ్ళ తర్వాత బంపర్ ఆఫర్!

సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావడం అనేది చాలా అరుదు. ఇక దర్శకుడిగా క్లిక్కయితే ఆ క్రేజ్ సినిమా సినిమాకు పెరుగుతూనే ఉంటుంది. దాన్ని నిలబెట్టుకోవడం ఒకానొక దశలో చాలా కష్టంగా మారుతుంది. ఇక అలాంటి సమస్యలు ఎదుర్కొన్న దర్శకులల్లో బొమ్మరిల్లు భాస్కర్ ఒకరు. మొదటి సినిమాతోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఈ దర్శకుడు ఇప్పుడు తన సక్సెస్ ట్రాక్ లోకి రావడానికి అమితంగా ప్రయత్నాలు చేస్తున్నాడు.

Recommended Video

Allu Arjun's Pushpa Breaks NTR Record With Most Liked First Look Poster
ఆ ఒక్క సినిమాతోనే..

ఆ ఒక్క సినిమాతోనే..

సినిమా జీవితంలో బ్రేక్ రావడానికి ఒకే ఒక్క సినిమా చాలు. అదే విధంగా కెరీర్ ని ఒక్కసారిగా కిందకు తోసేయ్యడానికి కూడా ఒక్క సినిమానే కారణమవుతుంది. భాస్కర్ కి బొమ్మరిల్లు లైఫ్ ఇస్తే.. ఆరెంజ్ సినిమా కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఆ తరువాత చేసిన ఒంగోలు గిత్త కూడా ఊహించని రిజల్ట్ ని అందుకుంది. దీంతో కొన్నేళ్ల వరకు భాస్కర్ బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది.

లక్కీ ఛాన్స్..

లక్కీ ఛాన్స్..

మొత్తానికి భాస్కర్ ఒక లక్కీ ఛాన్స్ పట్టేశాడు. అక్కినేని హీరో అఖిల్ నెక్స్ట్ సినిమాకు భాస్కర్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే ఆ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. నిజానికి ఈ ఆఫర్ రావడం భాస్కర్ కి ఒక అదృష్టమనే చెప్పాలి. అవకాశాలు రావడమే కష్టం అనుకున్న తరుణంలో గీత ఆర్ట్స్ బ్యానర్ లో మంచి ఆఫర్ అందుకున్నాడు.

హిట్టు పడితే బంపర్ ఆఫర్..

హిట్టు పడితే బంపర్ ఆఫర్..

అఖిల్ తో గనక భాస్కర్ హిట్ట కొడితే తప్పకుండా మరొక బంపర్ ఆఫర్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ స్వయంగా దర్శకుడికి ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గనక హిట్టయితే అల్లు అర్జున్ పుష్ప అనంతరం భాస్కర్ తో ఒక సినిమా చేయాలని అనుకుంటున్నాడట. ఇప్పటికే అఖిల్ సినిమా మేకింగ్ పై ఒక లుక్కేసిన బన్నీ ..అతని వర్క్ అమితంగా నచ్చేసిందట.

పన్నెండేళ్ళ తరువాత పరుగు కాంబో..

పన్నెండేళ్ళ తరువాత పరుగు కాంబో..

ఇదివరకే బన్నీ బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్ లో పరుగు సినిమా వచ్చింది. 25కోట్లకు పైగా లాభాలను అందించిన ఆ సినిమా అప్పట్లో బన్నీ మార్కెట్ ని అమితంగా పెంచేసింది. ఇక 12 ఏళ్ళ తరువాత మళ్ళీ ఈ కాంబినేషన్ లో మరో సినిమా రానున్నట్లు టాక్ వస్తోంది. ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని భాస్కర్ హిట్టు సినిమా తీస్తే నెక్స్ట్ అతనితోనే సినిమా చేయాలనీ అనుకుంటున్నాడు. మరి ఈ దర్శకుడు ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X