For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Allu Arjun : కాకా హోటల్ ఓనర్ ఫేట్ మార్చిన స్టైలిష్ స్టార్.. దోశకు అంత ఇవ్వడమే కాకుండా మరో బంపర్ ఆఫర్!

  |

  మన తెలుగు సినిమా హీరోలు ఒక్కోసారి చేస్తున్న పనులు చూస్తే చాలా ముచ్చటేస్తుంది. తాము హీరోలం అనే భేషజాలు ఏ మాత్రం చూపించకుండా సామాన్య ప్రజలతో వాళ్ళు కలిసి పోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే అభిమానులు ఒక్కసారిగా మీద పడతారు అనే ఉద్దేశంతో బౌన్సర్లతో బయటకు వెళ్తూ ఉంటారు కానీ తమకు అవకాశం వస్తే సామాన్యులకు అండగా నిలబడుతూ ఉంటారు. ఈ విషయాన్ని మరో సారి ప్రూవ్ చేశారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఒక కాక హోటల్ లో టిఫిన్ చేసి బయటకు వస్తున్న విజువల్స్ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే అల్లు అర్జున్ వచ్చి హోటల్లో తిని వెళ్లాక ఆ కాకా హోటల్ నడుపుతున్న వ్యక్తి జీవితమే మారిపోయింది. అసలు ఏమైంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

  Allu Arjun Changes Hotel Owner's Fate || Filmibeat Telugu
  వేడివేడిగా ఉల్లి దోశ

  వేడివేడిగా ఉల్లి దోశ

  రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అని తెలుగు స్టార్‌ హీరో అల్లు అర్జున్‌ తలచుకుంటే ఫైవ్‌స్టార్‌ హోటల్లో టిఫిన్ చేయొచ్చు. కానీ మారుమూల పల్లెటూరులో ఓ చిన్న పాకలో ఆయన వేడివేడిగా ఉల్లి దోశ ఆరగించిన విజువల్స్ బయటకు రావడంతో నిన్నటి నుంచి సోషల్ మీడియాలో అదే హాట్ టాపిక్ గా మారుతోంది. నిజానికి అల్లు అర్జున్‌ నటిస్తున్న ‘పుష్ప' సినిమా షూటింగ్‌ ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలోని మారేడుమిల్లి తదితర ఏజెన్సీ ప్రాంతంలో జరుగుతోంది. దీంతో ఆయన కొన్ని రోజులుగా ఏజెన్సీ ప్రాంతంలోనే ఉంటున్నారు. అయితే ఇప్పుడు ఆయన నటిస్తున్న పుష్ప సినిమా షూటింగ్ కాకినాడ పోర్టులో జరుగుతోందని అంటున్నారు.

  కాకా హోటల్ లో టిఫిన్ చేసి

  అందులో భాగంగానే ఆయన శనివారం ఉదయం 11 గంటల సమయంలో గోకవరం మండలం కృష్ణుని పాలెంలో కలవల్లి శివ అనే వ్యక్తి నిర్వహిస్తున్న కాకా హోటల్‌కు వచ్చారు. అల్లు అర్జున్ తన రోడ్ సైడ్ హోటల్ కు రావడమే ఎక్కువ అని భావిస్తున్న క్రమంలో ఒక ఉల్లి దోశ కావాలని అడిగి వేడిగా వేయించుకుని ఆరగించారు. టిఫిన్‌కు డబ్బులు వద్దని శివ ఎంత వారించినా వినకుండా ఆయన తాను తిన్న దోశకు వేయి రూపాయలు ఇవ్వడమే కాకూండా తనతో పాటు మరో వ్యక్తికి మరో రూ.500 చెల్లించి ఎంత వేగంగా వచ్చాడో అంతే వేగంగా రాజమండ్రి వైపు పయనమయ్యాడు. దీనికి సంబం ధించిన వీడియో సోమవారం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

  బంపర్ ఆఫర్

  బంపర్ ఆఫర్

  తన హోటల్ లోకి హీరో రావడం జీవితాంతం మరచిపోలేనని, బిల్లు చెల్లించడం మాత్రమే కాకుండా అల్లు అర్జున్ తమకు అదనంగా వెయ్యి రూపాయలు ఇచ్చి వెళ్లారనీ హోటల్ యజమాని శివ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పూరిపాకలో తమ కష్టసుఖాలు తెలుసుకొని అల్లు అర్జున్ తమను హైదరాబాద్ పిలిపించి ఉద్యోగం ఇస్తామని కూడా హామీ ఇచ్చారని ఆయన చెప్పుకొచ్చాడు. ఇక ప్రస్తుతం పుష్ప షూటింగ్ లో భాగంగా కాకినాడ సీ పోర్ట్ లో ఎర్రచందనం స్మగ్లింగ్ కు సంబంధించిన సన్నివేశాలను చిత్ర యూనిట్ భారీ ఎత్తున చిత్రీకరిస్తున్నారని అంటున్నారు .

  భారీ అంచనాలు

  భారీ అంచనాలు

  కాకినాడలో బస చేసిన ఆయన ఏజెన్సీ ప్రాంతంలో కూడా కొన్ని సన్నివేశాల చిత్రీకరణకు వెళ్తున్నారు. అలాగే మొన్న అల్లు అర్జున్ సీటీమార్ సినిమా చూసిన విషయం కూడా సోషల్ మీడియాలో హైలైట్ అయింది. ఇక సుకుమార్ కాంబినేషన్ లో ఆయన ఈ పుష్ప సినిమా చేస్తూ ఉండగా ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఆర్య, ఆర్య 2 సినిమా సూపర్ హిట్ గా నిలిచిన నేపథ్యంలోనే ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

  పుష్పతో బిజీ బిజీ

  పుష్పతో బిజీ బిజీ


  అయితే ఈ సినిమాలో మొట్ట మొదటిసారిగా అల్లు అర్జున్ తన కెరీర్ మొత్తం మీద ఒక డీ గ్లామర్ రోల్ లో నటిస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్ప రాజ్ అనే ఒక లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నాడు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సునీల్, ఫహాద్ ఫాజిల్, అనసూయ, అజయ్ వర్ష బొల్లమ్మ లాంటి ఇతర కీలక నటీనటులు నటిస్తున్నారు. ఈ సినిమా క్రిస్మస్ సంధర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

  English summary
  a video became viral that Allu Arjun coming from a road side hotel. as per latest reports hotel owner denied to take money for dosa ate by allu arjun, but the star insisted and gave ₹1000, and also asked him to come to Hyderabad for a job after knowing that he is financially unstable.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X