అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పెళ్లిలో సందడి చేసిన అల్లు అర్జున్
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తనకు అత్యంత సన్నిహితుడైన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ శిరీస్ పెళ్లి వేడుకలో సందడి చేశారు. హైదరాబాద్‌లో జరిగిన శిరీష్ వివాహానికి బన్నీ హాజరైన నూతన వధూవరులను ఆశీర్వదించారు.
శిరీష్ ప్రస్తానం గీతా ఆర్ట్స్ ఆఫీసులో అసిస్టెంటుగా ప్రారంభం అయింది. డాన్స్‌లో శిరీష్ ఆసక్తి గమనించిన బన్నీ... అతడికి ట్రైనింగ్ ఇప్పించారు. స్టైలిష్ స్టార్ ప్రోత్సాహంతో రాటు దేలేలిన అతడు ప్రస్తుతం ఇండస్ట్రీలో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పని చేస్తున్నాడు.

అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే... ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్నాడు. బన్నీ కెరీర్లో 19వ చిత్రంగా రూపొందుతుండగా హారిక అండ్ హాసిని క్రియేషన్స్. గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
'జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి' చిత్రాల విజయాల తర్వాత బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న మూవీ కావడంతో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ లాంటి బడా ప్రొడ్యూసర్స్ ఇన్వాల్వ్ అయిన మూవీ కావడంతో భారీ స్కేల్‌లో నిర్మిస్తున్నారు.
ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. సెకండ్ షెడ్యూల్ ప్రారంభం అవ్వడానికి కొంత గ్యాప్ ఉండటంతో బన్నీ తన ఫ్యామిలీతో కలిసి స్విట్జర్లాండ్ వెకేషన్ వెళ్లి వచ్చారు. ఈ చిత్రంలో కథానాయికగా పూజా హెగ్డే నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సమాచారం ప్రకారం సెకండ్ హీరోయిన్ ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. సెకండ్ షెడ్యూల్‌లో కేతిక శర్మ జాయిన్ అవుతుందట.


Click it and Unblock the Notifications











