పిల్లనిచ్చిన మామ కోసం అల్లు అర్జున్ ఆ పని.. నల్గొండకు ఎందుకు వెళ్తున్నాడంటే?

గంగోత్రి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ తర్వాతి కాలంలో వరుస సినిమా హిట్స్ ఇచ్చాడు. తన డ్యాన్స్, యాక్టింగ్ స్టైల్ తో అశేషమైన అభిమానులను సంపాదించుకుని స్టైలిష్ స్టార్ గా ఎదిగాడు.

ఇక క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ అయ్యాడు. ఇప్పుడు పుష్ప 2తో అలరించనున్నాడు. అయితే తాజాగా తనకు పిల్లనిచ్చిన మామ, స్నేహ రెడ్డి తండ్రి, బీఆర్ఎస్ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కోసం అల్లు అర్జున్ చేసే ఓ పని ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది.

Allu Arjun Attends To His Uncle Kancharla Chandrasekhar Reddy Convention Hall Launch

వరల్డ్ వైడ్ హిట్: తెలుగు చిత్ర పరిశ్రమలో స్టైలిష్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు అల్లు అర్జున్. తొలి సినిమా నుంచి నేటి వరకు ప్రతి మూవీకి తనలో మార్పులు చేసుకుంటూ సక్సెస్ ఫుల్ హీరోగా అడుగులు వేస్తున్నాడు. ఇక ఇంటర్నేషనల్ స్థాయిలో సత్తా చాటిన చిత్రాల్లో పుష్ప ఒకటి. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే.

Allu Arjun Attends To His Uncle Kancharla Chandrasekhar Reddy Convention Hall Launch

జాగ్రత్తలు: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమాకు సీక్వెల్ వస్తుందనేది తెలిసిన విషయమే. దీంతో పుష్ప 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. బన్నీ-సుక్కు కాంబోలో నాలుగోసారి వస్తున్న చిత్రం 'పుష్ప: ది రూల్' కోసం నటీనటుల నుంచి టేకింగ్ వరకు సుకుమార్ ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Allu Arjun Attends To His Uncle Kancharla Chandrasekhar Reddy Convention Hall Launch

టీజర్ కు రెస్పాన్స్: పుష్ప 2 సినిమాలో సీనియర్ హీరో జగపతి బాబు, బిగ్ బాస్ దివి, ఫహద్ ఫాసిల్, సునీల్, అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక పుష్ప 2 సినిమా నుంచి ఇటీవల విడుదల చేసిన టీజర్, ఫస్ట్ లుక్, వీడియో గ్సింప్స్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయ్యాయి. The HUNT before the RULE టైటిల్ తో బయటకు వదిలిన 'పుష్ప: ది రూల్' మూవీ టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

Allu Arjun Attends To His Uncle Kancharla Chandrasekhar Reddy Convention Hall Launch

నల్గొండకు బన్నీ: అంతేకాకుండా పుష్ప 2లో అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ కు ఇన్ స్టా లో 7 మిలియన్లకుపైగా వ్యూస్ వచ్చి ఆల్ టైమ్ రికార్డ్ నెలకొల్పింది. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ ఇవాళ అంటే ఆగస్ట్ 19 నల్గొండ జిల్లాలోని భట్టుగూడెం గ్రామానికి వెళ్లనున్నాడు. బన్నీ మామ, బీఆర్ఎస్ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి స్వగ్రామం వద్ద నిర్మించిన ఫంక్షన్ హాల్ ను అల్లు అర్జున్ ప్రారంభించనున్నాడు.

Allu Arjun Attends To His Uncle Kancharla Chandrasekhar Reddy Convention Hall Launch

వెయ్యి మందికి: పెద్దవూర మండలంలోని చింతపల్లి గ్రామానికి చెందిన చంద్రశేఖర్ భట్టుగూడెం వద్ద "కంచర్ల కన్వేన్షన్" పేరుతో ఫంక్షన్ హాల్ ను నిర్మించారు. ఇప్పటికే చంద్రశేఖర్ పెద్దవూర మండలం కేంద్రంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. తాజాగా ఆధునిక వసతులతో కూడిన 1000 మందికి సరిపడే ఫంక్షన్ హాల్ ను నిర్మించారు.

Allu Arjun Attends To His Uncle Kancharla Chandrasekhar Reddy Convention Hall Launch

10 వేల మందికి: "కంచర్ల కన్వేన్షన్" ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవానికి అల్లుడు అల్లు అర్జున్ తోపాటు, మంత్రి జగదీశ్ రెడ్డిలను ముఖ్య అతిథులుగా ఆహ్వానించారు చంద్రశేఖర్ రెడ్డి. అలాగే ఈ కార్యక్రమంలో నల్లగొండ జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా సుమారు 10 వేల మందికి భోజనాలతోపాటు మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని బన్నీకి పిల్లనిచ్చిన మామ ఏర్పాటు చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X