మెగా ఫ్యామిలీతో అల్లు అర్జున్‌కు పెరుగుతున్న దూరం.. బన్నీ కావాలనే చేస్తున్నాడా?
టాలీవుడ్ సినిమాలో స్థిరపడ్డ టాప్ మోస్ట్ హీరోస్ లో ఎవరికీ తమ స్టార్డం ఊరికే వచ్చింది కాదు. కుటుంబ నేపథ్యం ఉన్నప్పటికీ అలా కుటుంబాలు నుంచి వచ్చిన అందరూ స్టార్స్ కాలేకపోయారు. అయితే సక్సెస్ అయ్యిన వారిలో మాత్రం టాలీవుడ్ నుంచి కొందరు ఉన్నారు. వారిలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఒకడు.
ఇండస్ట్రీలోకి మెగా కుటుంబ ముద్రతో వచ్చిన బన్నీ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యి ఐకాన్ స్టార్ అనే ట్యాగ్ తెచ్చుకున్నాడు. అయితే స్టార్ గా ఎంత ఎత్తుకి ఎదిగినా మూలాలు ఎన్నటికీ మర్చిపోకూడదు అని అంతా అంటుంటారు. ఇప్పుడు సరిగ్గా ఇదే బన్నీ విషయంలో గట్టిగా వినిపిస్తుంది.

గడిచిన కొన్నాళ్లలోనే వ్యక్తిగతంగా బన్నీ లో వచ్చిన మార్పులు కూడా మెగా అభిమానులు చాలానే చూసారు. కానీ మధ్యలో మళ్ళీ అంతా ఒకటే అని ప్రూవ్ చేయడానికి కొన్ని సందర్భాలు దోహదపడ్డాయి. దీనితో అంతా సెటిల్ అయ్యింది అనుకున్నారు. కానీ మళ్ళీ తెలిసి చేసాడో లేక తెలియక చేసాడో కానీ అల్లు అర్జున్ మళ్ళీ నిప్పు రాజేసాడు.
ఇటీవల పొలిటికల్ గా తాను తీసుకున్న స్టాండ్ మెగా ఫ్యాన్స్ లో చీలిక తీసుకొచ్చింది. ఒకొక్కరు ఒకో థియరీలు చెప్తున్నారు కానీ ఓవరాల్ గా చూస్తే మాత్రం నెగిటివ్ అంతా బన్నీ చర్యల్లోనే కనిపిస్తుంది. పవన్ ఓ పార్టీలో ఉన్న తన ఫ్రెండ్ కీ అలాగే పవన్ కళ్యాణ్ కి కూడా మద్దతు ఇచ్చాడు.
కానీ బయటకి మాత్రం పవన్ కోసం వెళ్లకుండా ఒక్క తన ఫ్రెండ్ కోసమే వెళ్లడం నెక్స్ట్ ఒక్క పవన్ కి మాత్రమే ట్వీట్ వేయడం పైగా కనీసం పవన్ ని ఇంకా కలవకపోవడం వంటివి పెద్ద చర్చకే దారి తీస్తున్నాయి. ఇవి చాలదు అన్నట్టుగా సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ని ఏం ఫాలో కొట్టడం ఇంకొక ఎత్తుగా మారింది.
దీనితో నిజంగానే బన్నీ కి మెగా ఫ్యామిలీకి పడడం లేదా అనేది చర్చకు దారి తీసింది. అయితే కొందరు అల్లు అర్జున్ కి ఇపుడు పాన్ ఇండియా క్రేజ్ రావడంతో తన మూలాలు మర్చిపోయాడు అని.. ఇంకొందరు కావాలని అటెన్షన్ కోసమే ఇలా చేస్తున్నాడు అంటూ చాలానే కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఒకటి మాత్రం క్లియర్ బన్నీ మాత్రం మెగాకి దూరం అవుతున్నట్టుగా క్లియర్ గా కనిపిస్తుంది.
మరి ఫ్యూచర్ లో కూడా ఇదే కొనసాగుతుందా లేక ఏమన్నా మారుతుందా అనేది కాలమే నిర్ణయించాలి. కాగా ఇప్పుడు అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా ఇది ఆగస్ట్ రేస్ నుంచి డిసెంబర్ కి షిఫ్ట్ అయ్యింది.


Click it and Unblock the Notifications











