twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల్లు అర్జున్ మైండ్ బ్లోయింగ్ రెమ్యునరేషన్.. కెరీర్ లోనే మొదటిసారి అత్యధికంగా..

    |

    టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమా మార్కెట్ తో పాటు హీరోల రెమ్యునరేషన్ కూడా అంతకంతకు పెరుగుతూనే ఉంది. బాహుబలి అనంతరం పాన్ ఇండియా సినిమాలు ఏ రేంజ్ లో సెట్స్ పైకి వచ్చాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. కానీ అన్ని సినిమాలు అనుకున్నంతగా ఆడడం లేదు. ఇక హీరోల మార్కెట్ మాత్రం ఎప్పటికప్పుడు ఎంచుకునే స్టోరీలను బట్టి మారుతూనే ఉంది. ఇక అల్లు అర్జున్ రెమ్యునరేషన్ ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

    అంచనాలకు తగ్గట్లుగానే

    అంచనాలకు తగ్గట్లుగానే

    ఐకాన్ స్టార్ గా కొత్త ట్యాగ్ తో వైరల్ అవుతున్న బన్నీ నెక్స్ట్ పుష్ప సినిమాతో ఎలాగైనా నేషనల్ వైడ్ గా హిట్టు కొట్టాలని చూస్తున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో చేస్తున్న ఆ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మైత్రి మూవీ మేకర్స్ కూడా అంచనాలకు తగ్గట్లుగానే భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మిస్తోంది.

     ఎవరు ఊహించలేదు..

    ఎవరు ఊహించలేదు..

    పుష్ప రాజ్ ఫస్ట్ లుక్ టీజర్ తోనే మంచి బజ్ క్రియేట్ అయ్యింది. తగ్గేదే లే.. అంటూ అల్లు అర్జున్ యాక్షన్ సీక్వెన్స్ తో అంచనాల డోస్ ను అమాంతంగా పెంచేశాడు. ఆ రేంజ్ లో సరికొత్త లుక్కుతో షాక్ ఇస్తాడాని ఎవరు ఊహించలేదు. మొత్తానికి బన్నీ ఏదో సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నట్లు క్లారిటీ అయితే వచ్చేసింది.

     అత్యధిక రెమ్యునరేషన్

    అత్యధిక రెమ్యునరేషన్

    ఇక సినిమాను రెండు బాగాలుగా తెరకెక్కించాలని డిసైడ్ అయినప్పుడు రెమ్యునరేషన్ అనేది కొందరికి అడ్వెంటేజ్ గా మారిందని టాక్ వస్తోంది. ముఖ్యంగా డైరెక్టర్ సుకుమార్ తో పాటు అల్లు అర్జున్ కు కూడా పారితోషికం పెంచేసినట్లు తెలుస్తోంది. బన్నీ ఇంతవరకు తన కెరీర్ లో ఎప్పుడు లేని విధంగా అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం.

    మొత్తం రెమ్యునరేషన్ ఎంతంటే..

    మొత్తం రెమ్యునరేషన్ ఎంతంటే..

    మొదట సినిమాకు 35కోట్ల వరకు అగ్రిమెంట్ సెట్ చేసుకున్నారట. ఇక రెండు భాగాలుగా అనేసరికి మార్కెట్ లో డిమాండ్ కూడా అమాంతంగా పెరిగిపోయింది. దీంతో రెండు భాగాలకు కలిపి 70కోట్లకు డీల్ సెట్ చేసుకున్నట్లు టాక్ వస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని బన్నీకి మాత్రం నెవర్ బిఫోర్ అనేలా మాత్రం పారితోషికం దక్కుతున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి.

    English summary
    Along with the movie market in the Tollywood industry, the remuneration of heroes is also on the rise. Needless to say, the range of Pan India films after Bahubali came up on the sets. But not all movies play as well as expected. The market for heroes, however, is constantly changing depending on the stories you choose. Allu Arjun's remuneration has now become a hot topic in the South industry.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X