Allu Arjun : సెర్బియాకు 50 మందిని తీసుకెళ్లి గ్రాండ్ బ‌ర్త్‌డే పార్టీ.. ఆ సమస్య తోనే అక్కడి దాకా

టాలీవుడ్ ఐకాన్ స్టార్ గా మారిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజు వేడుకలు సెర్బియా దేశంలో అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఆయన పుట్టిన రోజు వేడుకలకు సంబంధించిన కొన్ని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలు అల్లుఅర్జున్ స్వయంగా షేర్ చేయడంతో ఫాన్స్ ఇప్పుడు అల్లు అర్జున్ ఫోటోలు షేర్ చేస్తూ ఆయన కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే

ఫ్యాన్ బేస్

ఫ్యాన్ బేస్


అల్లు రామలింగయ్య మనవడిగా, అల్లు అరవింద్ కొడుకుగా, మెగాస్టార్ చిరంజీవి అల్లుడిగా సినీరంగ ప్రవేశం చేసిన అల్లు అర్జున్ అతి కొద్ది కాలంలోనే స్టైలిష్ స్టార్ గా పేరు తెచ్చుకొని తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్నాడు. కొన్నాళ్ల క్రితం వరకు వరుస ఫ్లాప్ లతో ఇబ్బంది పడిన ఆయన అల వైకుంఠపురం సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నాడు.

వంద కోట్లకు పైగా

వంద కోట్లకు పైగా

ఆ సినిమా ఇచ్చిన జోష్ తో సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేశాడు. అల్లు అర్జున్ కెరీర్ లోనే మొట్టమొదటిసారిగా పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన పుష్ప సినిమా మొదటి భాగం అద్భుతమైన విజయం సాధించింది. సుకుమార్ దర్శకత్వం లో రష్మిక మందన్న హీరోయిన్ గా, అనసూయ, సునీల్, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషించిన పుష్ప నార్త్ బెల్ట్ లో సూపర్ హిట్ అయి వంద కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి లాభాల పంట పండించింది.

సాధారణ పౌరులు లాగా

సాధారణ పౌరులు లాగా

ఇక ఆ సినిమా సక్సెస్ తో సూపర్ జోష్ లో ఉన్న అల్లు అర్జున్ తన 40వ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం సెర్బియా దేశంలోని బెల్గ్రేడ్ అనే ప్రదేశానికి వెళ్లి ఆయన తనతో పాటు తన భార్య స్నేహ రెడ్డి సహా మరో 50 మంది అత్యంత క్లోజ్ గా ఉండే ఫ్రెండ్స్ ని పార్టీ కోసం తీసుకెళ్లినట్లు సమాచారం. భారతదేశంలో అయితే పుష్ప కారణంగా వచ్చిన క్రేజ్ తో సరిగా ఎంజాయ్ చేయలేము అనే ఉద్దేశంతో మనవాళ్ళు లేని ప్రదేశానికి వెళ్ళి అక్కడ సాధారణ పౌరులు లాగా ఈ బర్త్ డే వేడుకలు జరుపుకున్నట్లు తెలుస్తోంది.

పుట్టినరోజు శుభాకాంక్షలు

పుట్టినరోజు శుభాకాంక్షలు

ఇక అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువలా వచ్చి కురుస్తున్నాయి. సినిమా హీరో హీరోయిన్లు, ఇతర నటీనటులు, దర్శక నిర్మాతలు ఇలా సినీ పరిశ్రమకు చెందిన వారు మాత్రమే కాకుండా సాధారణ పౌరులు కూడా అల్లు అర్జున్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే అల్లు అర్జున్ తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన అందరినీ ఉద్దేశిస్తూ ఒక స్పెషల్ నోట్ విడుదల చేశారు.

 స్పెషల్ నోట్ విడుదల

స్పెషల్ నోట్ విడుదల

నాకు శుభాకాంక్షలు తెలిపిన మీ అందరికీ ధన్యవాదాలు. మీ ప్రేమ, మీ బ్లెస్సింగ్స్ నన్ను ఇక్కడి వరకు తీసుకు వచ్చాయి. ఈ 40 ఏళ్ల జీవితంలో నేను వెనక్కి చూసుకుంటే కనుక ఒక రకంగా అదృష్టవంతుడిని అని చెప్పాలి. ఎందుకంటే మీ అందరి బ్లెస్సింగ్స్ నా మీద ఉన్నాయి. మా తల్లిదండ్రులు, కుటుంబం, స్నేహితులు, గురువులు, శ్రేయోభిలాషులు, నా సినీ పరిశ్రమ, ప్రేక్షకులు, అలాగే నా స్పెషల్ ఫాన్స్ ఇలా ప్రతి ఒక్కరూ నా ఎదుగుదలకు కారణమయ్యారు అని చెప్పుకొచ్చారు. ఈ అద్భుతమైన అనుభవాన్ని తనకు పంచినందుకు అందరికీ ధన్యవాదాలు అంటూ ఆయన చెప్పుకొచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X