Unstoppable 4: అదే చిరు బన్నీల బంధం.. నేషనల్ అవార్డ్ పై అల్లు అర్జున్ షాకింగ్ కామెంట్స్..
Allu Arjun in Unstoppable 4: నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న టాక్ షో 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే' (Unstoppable with NBK). ఈ టాక్ షో సక్సెస్ పుల్ గా నడుస్తున్నది. తాజాగా అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే 4వ సీజన్ నాల్గవ ఎపిసోడ్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గెస్ట్ గా వచ్చారు. తరుణంలో మెగా స్టార్ చిరంజీవిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే లేటేస్ట్ ప్రోమో వివరాల్లోకెళ్తే..
అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే ప్రొమో ప్రారంభం కాగానే.. సమర సింహారెడ్డి గెటప్ లో బాలకృష్ణ ఎంట్రీ ఇస్తాడు. 'వీర సింహారెడ్డి. పుట్టింది పుదిచెర్ల.. చదివింది అనంతపురం.. రూలింగ్ కర్నూల్..' అంటూ మాస్ డైలాగ్ చెప్పి ప్రేక్షకులలో జోష్ నింపుతాడు. ఆ తర్వాత..'కర్మ సిద్ధాంతాన్ని అవపోసన పట్టిన కార్మికుడు.. ఐకాన్ స్టార్ ఎదిగిన నా స్నేహితుడు' అంటూ అల్లు అర్జున్ ను గ్రాండ్ గా ఆహ్వానిస్తాడు బాలకృష్ణ. ఈ సమయంలో బాలకృష్ణ తనదైన స్టైల్ లో 'తగ్గేదేలే' డైలాగ్ చెప్పి ప్రేక్షకులను అలరిస్తాడు.

అల్లు అర్జున్ తో మాట్లాడుతూ.. మనమిద్దరం రిలేటివ్స్ తెలుసా? అని ప్రశ్నిస్తాడు. ఆ ప్రశ్నతో అల్లు అర్జున్ కంగారుపడి..' ఎలా సార్ ?' అని బాలయ్యను తిరిగి అడుగుతాడు. 'ఇక్కడ కృష్ణుడు .. అక్కడ అర్జునుడు..' అంటూ సెటైరికల్ రిప్లే ఇస్తాడు. దీంతో బన్ని రియాక్ట్ అవుతూ.. 'మీరు గీత ఇవ్వండి.. నేను కురుక్షేత్రం చేస్తాను' అంటూ కౌంటర్ వేస్తాడు అల్లు అర్జున్. బాలయ్యా సరదాగా మాట్లాడుతూ..'ఏంటి బన్నీ నాకు పార్టీ ఇవ్వలేదు' అని ప్రశ్నిస్తాడు. 'కచ్చితంగా సార్.. మీ మెన్షన్ లో ఓ హౌస్ పార్టీ ఇస్తానంటూ' ఫన్నీ రిప్లై ఇస్తాడు బన్నీ.
అనంతరం.. నేషనల్ అవార్డు గురించి మాట్లాడుతూ బన్నీ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంటాడు. తాను ప్రతి సంవత్సరం నేషనల్ అవార్డు విన్నర్స్ లిస్టు చూసేవాడిననీ, ఆ లిస్టులో తెలుగువారి పేరు లేకపోవడం తనని పలుమార్లు కలిసి వేసిందని, ఆ విషయాన్ని తాను రౌండ్ అప్ చేసుకొని.. ఎలాగైనా దాన్ని కొట్టాలని, అ గోల్ ను అచీవ్ చేశానంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు బన్నీ.

ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవి ఫోటో చూపించి.. చిరుతో ఎలాంటి అనుబంధం ఉందో ? చెప్పమని అడుగుతాడు. ఆ ప్రశ్నకు అల్లు అర్జున్ రిప్లై ఇస్తూ.. చిరంజీవి గారితో బంధం, ప్రేమ, గౌరవం గురించి పంచుకున్నట్లు తెలుస్తోంది. చిన్ననాటి విషయాలను షేర్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత నీకు యాక్షన్ ఇష్టమా? రొమాన్స్ ఇష్టమా? అని తికమక పెట్టే ప్రశ్న వేస్తాడు. దానికి బన్నీ సమాధానం ఇస్తూ.. 'తొక్కలో యాక్షన్ సార్.. రొమాన్స్ అంటేనే...' అంటు ఇంట్రెస్టింగ్ సమాధానం చెప్పి ఫాన్స్ ని కడుపుబ్బ నవ్విస్తాడు బన్నీ. ఈ షోకు బన్నీ తల్లి నిర్మలమ్మ కూడా వచ్చారు.
ఆడపిల్లలకి అన్యాయం జరిగితే తాను అస్సలు సహించలేనని షాకింగ్ కామెంట్ చేశారు. తన వైఫ్ అల్లు స్నేహారెడ్డి కారణంగా జీవితం పూర్తిగా మారిందని అల్లు అర్జున్ తెలిపారు. రష్మిక, పూజా హెగ్డేలపై ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు బన్నీ. ఇలా పలు ఆసక్తికర విషయాల్ని పంచుకున్నారు అల్లు అర్జున్. ఈ ఎపిసోడ్ ఆహా లో నవంబర్ 15న రిలీజ్ కానుంది.
Unstoppable stage meeda #Akhanda #Pushpa 🥵🥵
— ahavideoin (@ahavideoIN) November 10, 2024
Episode lo entertainment taggede le 🔥🔥 Fire lanti episode ee Nov 15 ki!#Unstoppable #iconstar #AlluArjun𓃵 #AlluArjunOnAha #stylishstaralluarjun #UnstoppableS4 #UnstoppableWithNBK #balayyapanduga #NandamuriBalakrishna #JaiBalayya… pic.twitter.com/8dhKX2xHua
గతంలో పుష్ప 1 మూవీ ప్రమోషన్స్ భాగంగా అన్‌స్టాపబుల్ షో పాల్గొని బాలయ్య తో అల్లు అర్జున్ సందడి చేశాడు. తాజాగా పుష్ప 2 ప్రమోషన్స్ కోసం అన్‌స్టాపబుల్ షో పాల్గొనడం గమనార్హం. ఇదెలా ఉండే.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ పుష్ప 2 డిసెంబర్ 5 న పంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, పోస్టర్లు, టీజర్, గ్లిమ్స్ వంటి అప్డేట్ కు క్రేజీ రెస్పాన్స్ రావడం, రూ. 1,000 కోట్లకు పైగా ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసి పలు రికార్డులను క్రియేట్ చేసింది పుష్ప 2. మరీ డిసెంబర్ 5 నుంచి బాక్సాఫీస్ వద్ద పుష్పరాజ్ రూలింగ్ ఎలా ఉంటుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











