బన్ని బ్రదర్‌కు 100 మిలియన్లు.. ఆనందంలో ఎగిరి గంతేసిన అల్లు అర్జున్
అల్లు అర్జున్, శిరీష్ మధ్య అనుబంధం ఎంత గొప్పదో మాటల్లో చెప్పలేం. ఒకరి విజయాల్లో మరొకరు తమ సంతోషాన్ని పంచుకొంటారు. ఇటీవల అల్లు అర్జున్ బర్తే డే సందర్భంగా పుష్ప టీజర్‌ను రిలీజ్ చేయగా ఆ వేడుకలో అల్లు శిరీష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నా సోదరుడు అని కాదు గానీ.. అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో గురించి మాట్లాడే స్థాయి నాకు లేదు. ఆ స్థాయిని అందుకొన్న తర్వాత తన సోదరుడి గురించి మాట్లాడుతానని శీరీష్ తన అభిమానాన్ని వ్యక్తం చేశారు.
తాజాగా తన సోదరుడు అల్లు శీరిష్ నటించిన హిందీ పాట విలాయతీ షరాబ్ అనే చిత్రం సోషల్ మీడియాలో దుమ్ము రేపుతున్నది. ఈ పాట యూట్యూబ్‌లో ఏకంగా 100 మిలియన్ల వ్యూస్ సాధించింది. ఈ సందర్భంగా అల్లు శిరీష్‌ను బన్నీ అభినందిస్తూ ట్విట్టర్‌లో ఓ పోస్టు పెట్టారు.

విలాయతి షారాబ్ పాట 100 మిలియన్లు అందుకొన్న సందర్భంగా అల్లు శిరీష్‌కు బిగ్ కంగ్రాట్యులేషన్. ఈ పాట మంచి ఆదరణ పొందడం నాకు గర్వంగా ఉంది. టీమ్ సభ్యులందరికి నా అభినందనలు అంటూ అల్లు అర్జున్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
విలాయతి షరాతి పాటలో హెలీ దారువాలతో కలిసి అల్లు శిరీష్ స్టెప్పులేశారు. ఈ పాటను దర్శన్ రావల్, నీతి మోహన్ పాడారు. ఈ పాటను రిలీజ్ చేసిన తర్వాత అనూహ్యమైన స్పందన లభించింది.


Click it and Unblock the Notifications











