జయహో భారత్.. జయహో నీరజ్ చోప్రా.. తగ్గేదేలే అంటూ అల్లు అర్జున్ ప్రశంసల వర్షం

వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ పోటీల్లో భారత్ సత్తా చాటింది. హంగరీలోని బుడాపెస్ట్‌లోని నేషనల్ అథ్లేటిక్స్ సెంటర్‌లో జరిగిన జావెలిన్ త్రో పోటీల్లో భారత్‌కు చెందిన నీరజ్ చోప్రా రికార్డును సాధించాడు. ఆయన 88.17 మీటర్లు జావెలిన్‌ను విసిరి భారత్‌కు బంగారు పతాకాన్ని సాధించిపెట్టాడు. భారత్ తరఫున ఈ ఘనతను సాధించించిన తొలి ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. ఈ అరుదైన రికార్డును సాధించిన నీరజ్ చోప్రాపై సినీ ప్రముఖులు, దేశాధి నేత, రాజకీయ వర్గాలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ప్రపంచ అథ్లెటిక్ పోటీల్లో త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన నీరజ్ చోప్రాపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభినందించాడు. అల్లు అర్జున్ చేసిన పోస్టు గురించిన వివరాల్లోకి వెళితే..

ప్రతిభావంతుడైన నీరజ్ చోప్రా తన సామర్థ్యాన్ని, టాలెంట్‌ను ప్రపంచానికి చాటిచెప్పాడు. ఆతడి అంకితాభావం, పట్టుదల, తపన బంగారు పతకాన్ని సాధించేందుకు తొడ్పాడ్డాయని బలంగా నమ్ముతాను. క్రీడా ప్రపంచానికి తన సత్తాను చాటిెప్పాడు. వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకాన్ని సాధించిన నీరజ్ చోప్రాకు అభినందనలు అని నరేంద్రమోడీ అన్నారు.

Allu Arjun Congratulated Neeraj Chopra over gold medal in World Athletics Championships at Budpest

కేంద్ర క్రీడాశాఖామంత్రి అనురాగ్ థాకూర్ స్పందిస్తూ.. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో జావెలిన్ త్రోలో ఇండియన్ అథ్తెటిక్స్‌లో గోల్డెన్ బాయ్ విజయం సాధించాడు. అతడు సాధించిన అరుదైన రికార్డు చూసి దేశం గర్విస్తున్నది. భారతీయ క్రీడా చరిత్రలో దేశంలోని ప్రతీ ఒక్కరు గుర్తుంచుకొంటారు అని అన్నారు.

వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా సాధించిన రికార్డుపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రశంసలు గప్పించారు. వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో తొలిసారి బంగారు పతాకాన్ని సాధించిన నీరజ్ చోప్రాకు కంగ్రాట్స్. ఇండియా గర్వించ దగిన సంఘటన. జై హింద్ అంటూ అల్లు అర్జున్ తన ఇన్స్‌టాగ్రామ్ స్టాటస్‌లో సందేశాన్ని పోస్టు చేసి కంగ్రాట్స్ తెలియజేశారు.

Allu Arjun Congratulated Neeraj Chopra over gold medal in World Athletics Championships at Budpest

నీరజ్ చోప్రా సృష్టించిన రికార్డుపై సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ తన ఆనందాన్ని ట్విట్టర్‌లో వ్యక్తం చేశారు. గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా ఎదురులేని ఘనతను సాధించి.. భారత్ ప్రతిష్టను ప్రపంచ అథ్లెటిక్ రంగంలో పెంచాడు. ఈ పోటీల్లో తొలి బంగారు పతకాన్ని సాధించిన నీరజ్ చోప్రాకు థ్యాంక్స్. భారత్ తరుఫున ప్రాతినిథ్యం వహించిన అథ్లెటిక్స్ అందరికి నా అభినందనలు అని సాయిధరమ్ తేజ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X