Pawan Kalyan – Allu Arjun: అల్లు అర్జున్ షాకింగ్ కామెంట్స్.. ఫ్యాన్ వార్ కు తెరపడినట్టేనా..
Pawan Kalyan - Allu Arjun: అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో తెరకెక్కిన పుష్ప2 మూవీ దుమ్మురేపుతోంది. కేవలం బన్నీ ఫ్యాన్స్‌ను మాత్రమే కాదు.. ఫిల్మ్ లవర్స్‌ను కూడా ఫిదా చేస్తోంది.పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ క్రియేట్ చేస్తుంది. భారీ బడ్జెట్ మూవీ ఇప్పుడు వైల్డ్ గా రికార్డ్స్ బ్రేక్స్ చేస్తుంది. ఊహించని స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సాధించింది. ఇందులో అల్లు అర్జున్ యాక్టింగ్, సుకుమార్ టేకింగ్ కు ఫ్యాన్ ఇండియా మూవీ లవర్స్ సలాం కొడుతున్నారంటే.. అతిశయోక్తి కాదు. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా తొలి రోజు ఏకంగా రూ.294 కోట్లకు పైగా గ్రాస్ వసూల్లు రాబట్టి నయా రికార్డులను క్రియేట్ చేసింది. ఈ సందర్భంగా మూవీ యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహిస్తుంది
ఈ సందర్భంగా పుష్ప 2 సినిమా సక్సెస్ మీట్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. Pushpa 2 సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. 'సినిమా ఊహించని రేంజ్ లో విజయం సాధించింది. ఈ సినిమా మొత్తం టీం వర్క్ అయిన.. ఆ టీంను ముందుండి నడిపించింది దర్శకుడు మాత్రమే. ఈరోజు నాకు పేరు వచ్చినా.. వేరే ఆర్టిస్టులకు పేరు వచ్చినా.. ఆ క్రెడిట్ మొత్తం దర్శకుడు మాత్రమే దక్కుతుంది. ఈ రోజు నేను ఎన్ని కాంప్లిమెంట్స్ అందుకున్నా.. అన్నిటికీ డైరెక్టర్ సుకుమారే కారణం' అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

'నేను ఈరోజు ఇక్కడ ఉన్నానంటే.. నామీద సుకుమార్ కి ఉన్న ప్రేమ కారణం. ఇంతకంటే నేను ఎక్కువ ఏం చెప్పలేను డార్లింగ్. నన్ను తంతే ఎక్కడో పడ్డాను. నేను ఇది అహంకారంతో చెప్పట్లేదు. నేను చాలా వినంబరంగా చెప్తున్నాను. పుష్ప 2 సక్సెస్ కావడం వెనుక సుకుమార్ ఎంతో కష్టపడ్డాడు. తొలిరోజు రికార్డు స్థాయిలో కలెక్షన్స్ వచ్చాయి. ఆ నెంబర్ కూడా సరిగా గుర్తులేదు. ఆ నెంబర్ అనేది మీ ప్రేమ , మీ ఆప్యాయత.. దాన్ని వెలకట్టలేం 'అంటూ ఎమోషనల్ అయ్యారు అల్లు అర్జున్.
'పుష్ప 2 సినిమా సక్సెస్ కు సహకరించిన వారి అందరికీ ధన్యవాదాలు. ముందుగా తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి థాంక్స్ చెబుతున్నాను. మా సినిమాకి స్పెషల్ షోకు పర్మిషన్ ఇచ్చినందుకు.. అలాగే సినిమా టికెట్లు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చిన సినిమా ఆటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి గారికి స్పెషల్ థాంక్స్. ఇంత పెద్ద సినిమాకు మీలాంటి వాళ్లు ఇచ్చిన సపోర్ట్ వాళ్ళని మీ ముందుకు వెళ్తున్నాం'అంటూ కృతజ్ఞతలు తెలిపారు.

'అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా మమ్మల్ని సపోర్ట్ చేయడానికి, సినిమా టికెట్ రేట్లను పెంచుకోవడానికి అవకాశం కల్పించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. సినిమా రంగంపై ఆయన ఎన్నో సంవత్సరాలు గా ప్రేమ అభిమానాలను చూపిస్తున్నారు. ఆయనకు సభా ముఖంగా నేను అభినందనలు తెలుపుతున్నాను. అలాగే ఈ స్పెషల్ జీవోను పాస్ చేయడానికి కారణమైన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను. అలాగే నా పర్సనల్ నోట్.. ' కళ్యాణ్ బాబాయ్ థాంక్స్ 'అంటూ పేర్కొన్నారు. ఈ సందర్భంలో ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలకు కూడా ఇతర పరిశ్రమలకు కూడా అల్లు అర్జున్ కృతజ్ఞతలు తెలిపారు.
ప్రస్తుతం అల్లు అర్జున్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. స్పెషల్ గా పవన్ కళ్యాణ్ పేరును ఉచ్చరిస్తూ ధన్యవాదాలు తెలుపడంతో అటు మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పర్సనల్గా కళ్యాణ్ బాబాయ్ అంటూ ఆప్యాయంగా పేర్కొనడం కూడా మెగా అభిమానులను సంతోషం కలిగిస్తుంది. దీంతో ఇప్పటికైనా అల్లు వర్సెస్ మెగా ఫ్యాన్ వార్ ముగుస్తుందని సినీ లవర్స్ అభిప్రాయ పడుతున్నారు. ఇకనైనా సోషల్ మీడియాలో ట్రోల్స్ కు చెక్ పడుతుందా వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











