Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరో రికార్డ్.. తొలి భారతీయుడిగా ఘనత
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన డ్యాన్స్, యాక్టింగ్ తో తెలుగు రాష్ట్రాల ప్రజల్లో స్టైలిష్ స్టార్ గా ఎంతోకాలంగా ముద్ర వేసుకున్నాడు. ఇటీవల పుష్ప సినిమాతో గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. అలాగే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. ఈ సినిమాలో బన్నీ నటన, స్వాగ్, డైలాగ్స్, డ్యాన్స్ స్టెప్పులకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ప్రస్తుతం దానికి సీక్వెల్ గా 'పుష్ప: ది రూల్' సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అయితే అల్లు అర్జున్ తాజాగా అరుదైన రికార్డ్ సాధించాడు. అదేంటనే విషయంలోకి వెళితే..
చిరంజీవి నటించిన విజేత, కమల్ హాసన్ స్వాతి ముత్యం సినిమాలతో బాల నటుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన అల్లు అర్జున్ దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు డైరెక్ట్ చేసిన గంగోత్రి మూవీతో హీరోగా డెబ్యూ ఇచ్చాడు. తర్వాత ఆర్యతో స్టైలిష్ స్టార్ అనిపించుకున్నాడు ఇక పుష్ప సినిమాతోపుష్ప సినిమాతో సౌత్, నార్త్, ఇంటర్నేషనల్ అని ఏ తేడా లేకుండా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పేరు మారుమోగిపోయింది. 2021లో వచ్చిన ఈ సినిమాతో అల్లు అర్జున్ కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.

పుష్ప సినిమాలో పుష్ప రాజ్ నటనకు యావత్ ప్రపంచం బ్రహ్మరథం పట్టింది. పుష్ప సినిమాకు ఫిలీం ఫేర్ 67 అవార్డుల మహోత్సవంలో ఏకంగా 7 అవార్డులు రాగా, సైమా అవార్డులను వరించిన విషయం తెలిసిందే. అనంతరం అమెరికాలో గ్రాండ్ మార్షల్ గా వ్యవహరించిన అల్లు అర్జున్ కు ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా అందుకున్నాడు. సినిమా ఇండస్ట్రీలో గత 20 ఏళ్లలో ఉత్తరాది నుంచి దక్షిణ భారత నటుడుకి ఆ అవార్డు రావడం ఇదే తొలిసారి. అలాగే దుబాయ్ ప్రభుత్వం ఇచ్చే గోల్డెన్ విసా కూడా అందుకున్నాడు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం సోషల్ మీడియా హవా విపరీతంగా పెరిగిపోయింది. పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఇన్ స్టాగ్రామ్, ట్విటర్ తెగ వాడుతుంటారు. అయితే ఇన్ స్టా, ట్విటర్ వేదికలకు పోటీగా ఈ మధ్య థ్రెడ్స్ యాప్ లాంఛ్ అయిన విషయం తెలిసిందే. తొలి వారంలోనే 10 కోట్ల యూజర్లను రాబట్టింది థ్రెడ్స్. ఈ యాప్ ప్రారంభమైనప్పుడు ఈ ప్లాట్ ఫామ్ లో చేరిన మొట్టమొదటి తెలుగు నటుడిగా నిలిచిన అల్లు అర్జున్ తాజాగా మరో రికార్డ్ క్రియేట్ చేశాడు. థ్రెడ్స్ యాప్ లో బన్నీ 1 మిలియన్ కంటే ఎక్కువ మంది ఫాలోవర్లను సాధించిన తొలి భారతీయుడిగా నయా రికార్డ్ సృష్టించాడు. ఇది బన్ని సాధించిన మరో రికార్డ్ అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.


Click it and Unblock the Notifications











