twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రూ. 25 లక్షల సహాయం అందించిన అ(మ)ల్లు అర్జున్

    By Bojja Kumar
    |

    కేరళ వరద బాధితుల కోసం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రూ. 25 లక్షలు సహాయం ప్రకటించారు. గత కొన్ని రోజులుగా కేరళలో కురుస్తున్న వర్షాల కారణంగా భారీ వరదల రావడంతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. కొందరు ప్రాణాలు కోల్పోయారు. తమ రాష్ట్ర ప్రజలను ఆదుకోవాలని కేరళ సీఎం పినరాయి విజయన్ రిక్వెస్ట్ చేయడంతో సెలబ్రిటీలు, ప్రజలు స్పందిస్తున్నారు. తమ వంతు సహాయం అందిస్తున్నారు. ఇప్పటికే కమల్ హాసన్, కార్తి, సూర్య, విజయ్, విజయ్ దేవరకొండ తదితరులు సహాయం అందించగా తాజాగా అల్లు అర్జున్ స్పందించారు.

    కేరళ వరదల కారణంగా ఎఫెక్ట్ అయిన వారు త్వరగా సాధారణ స్థితికి రావాలని హృదయ పూర్వకంగా ప్రార్థిస్తున్నట్లు అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. కేరళ ప్రజలకు నా గుండెల్లో ప్రత్యేక స్థానం ఉంటుంది. వారు చూపే ప్రేమ, అభిమానం వెలకట్టలేనిది. భారీ వరదల ద్వారా వారికి జరిగిన నష్టం తీర్చలేనిది. నా వంతుగా రూ. 25 లక్షలు సహాయం అందిస్తున్నాను. ప్రేమతో మీ అ(మ)ల్లు అర్జున్ అని ట్విట్టర్లో పేర్కొన్నారు.

    Allu Arjun donate Ra. 25 Lakhs for Kerala Flood Relief

    ఇప్పటికే కేరళ బాధితుల కోసం కమల్ హాసన్ రూ. 25 లక్షలు విరాళం ప్రకటించారు. తమిళ స్టార్లు సూర్య, కార్తి కలిసి రూ. 25 లక్షలు ప్రకటించారు. తెలుగు స్టార్ విజయ్ దేవరకొండ తన వంతుగా రూ. 5 లక్షలు విరాళం ఇస్తున్నట్లు ట్వీట్ చేశారు.

    భారీ వర్షాల కారణంగా కేరళ రాష్ట్రంలోని పలు నదులు పొంగిపొర్లుతున్నాయి. రహదారులు, ఇళ్లు కొట్టుకుపోయాయి. వేల మంది నిరాశ్రయులయ్యారు. పలువురు ప్రాణాలు కోల్పోయారు.
    కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ విరాళాలు ఇవ్వడం ద్వారా ఆదుకోవాలని రిక్వెస్ట్ చేయడంతో పలువురు స్టార్లు స్పందించారు.

    English summary
    People of Kerala will always occupy a special place in my heart for the unmatchable Love & Affection they shower . Their Love & the Loss is Unmatchable. But still I take the Honour to do my bit. I hereby pledge to donate 25,00,000 for the #KeralaFloodRelief . Love “M”Allu Arjun.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X