అల్లు అర్జున్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మీకు తెలుసా? బన్నీ ఏం చదువుకున్నారంటే?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun).. మెగా కాపౌండ్ నుంచి ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు. స్టార్ లెగసీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా ఆ స్థాయికి తగినట్టుగా నిలబడ్డారు. లెజెండరీ కమెడియన్ అల్లు రామలింగయ్య మనవడిగా, అగ్ర నిర్మాత అల్లు అరవింద్ కుమారుడిగా, మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచెలను తగ్గట్టుగా బన్ని క్రమంగా విజయాలతో తనకంటూ ప్రత్యేక అభిమాన వర్గాన్ని కూడగట్టుకున్నారు. స్టైలిష్ స్టార్‌ నుంచి నేడు ఐకాన్ స్టార్ గా బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. ఈ నేపథ్యంతో అల్లు అర్జున్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ హాట్ టాపిక్ మారింది. అల్లు అర్జున్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మీకు తెలుసా? బన్నీ ఏం చదువుకున్నారంటే?

టాలీవుడ్‌లో ఐకాన్ స్టార్ గా బ్రాండ్ క్రియేట్ చేసుకున్న అల్లు అర్జున్ గురించి అభిమానుల్లో ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది. అతని సినిమాలు మాత్రమే కాదు, వ్యక్తిగత జీవితం, చదువు గురించి కూడా తెలుసుకోవాలని చాలామంది కోరుకుంటారు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ, తన కష్టంతోనే స్టార్‌డమ్ సాధించిన బన్నీ ప్రయాణం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. అల్లు అర్జున్ 1982 ఏప్రిల్ 8న చెన్నైలో అల్లు అరవింద్, నిర్మల దంపతులకు జన్మించారు. చిన్నప్పటి నుంచే ఆయనకు సినిమా వాతావరణం అలవాటైపోయింది. మేనమామగా చిరంజీవి వంటి మెగాస్టార్ ఉండటం వల్ల సినిమాలపై ఆసక్తి సహజంగానే పెరిగింది.

Allu Arjun Education Icon Star s Qualification and Rise to Pan India Stardom

అల్లు అర్జున్ చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టారు. 1985లో వచ్చిన విజేత సినిమాలో బాలనటుడిగా కనిపించారు. అయితే బన్నీ హీరోగా ఎంట్రీ మాత్రం 2003లో కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన 'గంగోత్రి' సినిమాతో. ఈ సినిమా ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అయితే అసలు బ్రేక్ మాత్రం 'ఆర్య' సినిమాతో వచ్చిందని చెప్పాలి. ఆ తర్వాత బన్నీ, దేశముదురు, పరుగు, ఆర్య 2, వేదం, జులాయి, రేసుగుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో సినిమాలతో టాలీవుడ్‌లో స్టార్ హీరోగా ఎదిగారు.

ముఖ్యంగా పుష్ప: ది రైజ్, పుష్ప 2:ది రూల్ సినిమాలతో ఆయన పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయారు. ప్రస్తుతం ఆయన అట్లే దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాకా (Raaka)సినిమాలో నటిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇప్పటికే భారీ హైప్ సృష్టించింది.

ఇక చదువు విషయానికి వస్తే.. అల్లు అర్జున్ స్కూలింగ్ మొత్తం చెన్నైలో సాగింది. ప్రాథమిక విద్యను చెన్నైలోని సెయింట్ ప్యాట్రిక్ స్కూల్‌లో పూర్తిచేశారు. తర్వాత కుటుంబంతో కలిసి హైదరాబాద్‌కు మారిన ఆయన, ఇక్కడ ఎంఎస్ ఆర్ (MSR) కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (BBA) పూర్తి చేశారు. అంటే బన్నీ ఒక గ్రాడ్యుయేట్ మాత్రమే కాకుండా, బిజినెస్‌పై కూడా అవగాహన కలిగిన వ్యక్తి అని చెప్పాలి. ఆయన ప్రస్తుతం చేస్తున్న వ్యాపారాలు కూడా దీనికి నిదర్శనం. ఇక వ్యక్తిగత జీవితంలో కూడా బన్నీ సక్సెస్ ఫుల్. 2011లో స్నేహారెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు అయాన్, ఆర్హా. కుటుంబానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో, సోషల్ మీడియాలో తరచూ కనిపించే ఫ్యామిలీ మూమెంట్స్ ద్వారా తెలుస్తుంది.

ఇక సంపాదన విషయానికి వస్తే.. అల్లు అర్జున్ ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే నటుల్లో ఒకరు. ఒక్కో సినిమాకు రూ.200 నుంచి రూ.300 కోట్ల వరకు తీసుకుంటున్నారని టాక్. ఇంకా AAA మల్టీప్లెక్స్, బఫెలో వైల్డ్ వింగ్స్ వంటి రెస్టారెంట్ బిజినెస్, Aha OTT వంటి ప్రాజెక్ట్‌లలో కూడా భాగస్వామ్యం ఉంది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఆయనకు ఉన్న లగ్జరీ హౌస్ విలువ రూ.100 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. మొత్తం బన్నీ నెట్ వర్త్ రూ.500 కోట్లకు పైగానే సమాచారం.

Read more about: allu arjun Raaka tollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X