ఫార్చ్యూన్ మోస్ట్ వాల్యూబుల్ సెలబ్రిటీల లిస్ట్... టాలీవుడ్ నుంచి ఒకేఒక్కడుగా అల్లు అర్జున్!

ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. పుష్ప సిరీస్ తర్వాత అల్లు అర్జున్ క్రేజ్, మార్కెట్ వాల్యూ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆయన సినిమా కోసం టాలీవుడ్‌తో పాటు ఉత్తరాది అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో రాకాలో నటిస్తున్నారు. ఈ సినిమాను వేగంగా పూర్తి చేసి అభిమానులను అలరించాలని బన్నీ ప్రణాళికలు రచిస్తున్నారు. కెరీర్‌లో ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్న అల్లు అర్జున్ తాజాగా మరో ఘనతు అందుకున్నారు.

ఇండియాలో కొందరు సెలబ్రిటీలు వారి వారి వృత్తులకే పరిమితం కాకుండా ఒక బ్రాండ్‌గా మారుతుంటారు. వరుస విజయాలు, అవార్డులతో పాటు ఇతర అంశాలతో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని ఒక బ్రాండ్‌గా ఎదుగుతారు. వీటిన్నింటినీ ఆధారంగా ఫార్చ్యూన్ ఇండియా ఇంటర్ బ్రాండ్ తాజాగా భారతదేశంలో మోస్ట్ వాల్యూబుల్ సెలబ్రిటీల లిస్ట్ ప్రకటించింది. మొత్తం 25 మందితో కూడిన ఈ లిస్ట్‌లో పలువురు సినీతారలు, క్రికెటర్లు స్థానం సంపాదించారు.

Allu Arjun Enters Fortune India s Top 10 Most Valuable Celebrities List

సెలబ్రిటీల సంపాదన, సోషల్ మీడియా ఫాలోవర్లు, ఆర్ధిక ప్రదర్శన, ప్రత్యేకత, ప్రజల్లో ఉన్న నమ్మకం, బాధ్యత వంటి పలు అంశాలను మదింపు చేసి ఈ బ్రాండ్‌ వాల్యూని లెక్కించింది ఫార్చ్యూన్. ఈ లిస్ట్‌లో టీమిండియా స్టార్ క్రికెటర్ నెంబర్ వన్ ప్లేస్‌లో నిలిచారు. ఆయన బ్రాండ్ వాల్యూ దాదాపు 3542 కోట్ల రూపాయలుగా విశ్లేషకులు తెలిపారు. కోహ్లీ తర్వాతి ప్లేస్‌లో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, ప్రియాంక చోప్రా, మహేంద్ర సింగ్ ధోనీ, రణ్‌వీర్ సింగ్, అక్షయ్ కుమార్, అమితాబ్ బచ్చన్, సచిన్ టెండూల్కర్, అలియా భట్, అల్లు అర్జున్‌లు టాప్ టెన్‌లో నిలిచారు.

అల్లు అర్జున్ 10వ స్థానంలో నిలిచి టాలీవుడ్ నుంచి టాప్ 10లో చోటు దక్కించుకున్న నటుడిగా నిలిచారు. బాలీవుడ్ స్టార్స్, క్రికెటర్ల నుంచి గట్టి పోటీ ఎదురవుతున్నప్పటికీ బన్నీ టాప్ 10లో నిలవడం విశేషం. ఆయన బ్రాండ్ వాల్యూ దాదాపు 1522 కోట్ల రూపాయలుగా విశ్లేషకులు లెక్కకట్టారు. పుష్ప సిరీస్ తర్వాత వచ్చిన క్రేజ్‌తో పాటు ఆయన సినిమాలు, సోషల్ మీడియా ఎంగేజ్‌మెంట్స్, వాణిజ్య ప్రకటనలు, బ్రాండ్ అండార్స్‌మెంట్స్ తదితర అంశాల ఆధారంగా అల్లు అర్జున్‌కి లిస్ట్‌లో ఆ స్థానం దక్కింది.

అల్లు అర్జున్ బ్రాండ్ అండార్స్‌మెంట్స్ చేసినందుకు గాను 4 నుంచి 6 కోట్ల రూపాయలు ఛార్జ్ చేస్తున్నట్లుగా టాలీవుడ్ టాక్. ప్రపంచ ప్రఖ్యాత శీతల పానీయాల సంస్థ కోకాకోలాతో పాటు రెడ్ బస్ తదితర సంస్థలకు బన్నీ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. సినిమాలతో పాటు సక్సెస్‌ఫుల్ బిజినెస్‌మెన్‌గానూ అల్లు అర్జున్ నిరూపించుకున్నారు. ప్రస్తుతం అల్లు స్టూడియోస్, అల్లు సినిమాస్ వ్యవహారాలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. ఇది కాకుండా ఫుడ్ అండ్ బెవరేజెస్ సెక్టార్‌లో అల్లు అర్జున్ పలు పెట్టుబడులు పెట్టారు.

ఇక ఫార్చ్యూన్ ఇండియా మోస్ట్ వాల్యూబుల్ సెలబ్రిటీస్- టాప్ 25 లిస్ట్‌లోని మిగిలిన వారి విషయానికి వస్తే దీపిక పదుకొణె 11వ స్థానంలో నిలిచారు. ఆ తర్వాత రోహిత్ శర్మ, దల్జిజ్ దోసాంజ్, ఆర్జిత్ సింగ్, కరణ్ జోహార్, సౌరవ్ గంగూలీ, రష్మిక మందన్న, విక్కీ కౌశల్, ప్రభాస్, రణబీర్ కపూర్, కృతి సనన్, కమల్ హాసన్, స్మృతి మందాన, నయనతార, యశ్‌లు ఉన్నారు. టాలీవుడ్ నుంచి టాప్ 20 ప్రభాస్, అల్లు అర్జున్, రష్మికలు నిలవగా.. టాప్ 10లో మాత్రం అల్లు అర్జున్ తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి స్థానం సంపాదించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X