గణేష్ నిమజ్జనంలో ఫ్యామిలీతో కలిసి అల్లు అర్జున్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో కలిసి గణేష్ చతుర్థి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఆదివారం జరిగిన నిమజ్జనం వేడుకల్లో కూడా సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోను బన్నీ ఇన్‌స్టాగ్రామ్ పేజీ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫోటోలో ఆయన భార్య స్నేహారెడ్డితో పాటు పిల్లలు ఉన్నారు.
అల్లువారి ఇంట్లో ఫేవరెట్ ఫెస్టివల్ ఇది. గతంలో కూడా ఒసారి బన్నీ ఈ విషయమై మాట్లాడుతూ... మా ఇంట్లో ప్రతి ఏడాది గణేష్ ఫెస్టివల్ చాలా గ్రాండ్‌గా జరుపుకుంటాం. ఎకోఫ్రెండ్లీ గణేషుడిని ప్రతి సంవత్సరం పూజిస్తామని తెలిపారు.

బన్నీ సినిమాల విషయానికొస్తే.... ఆయన నటించిన 'నా పేరు సూర్య' విడుదలై కొన్ని నెలలు గడుస్తున్నా తర్వాతి సినిమా ఏమిటనేది ఇంకా ఫైనల్ కాలేదు. వక్కతం వంశీ దర్శకత్వంలో సోల్జర్ సూర్య కథ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వలేదు. బన్నీ తర్వాతి సినిమా అనౌన్స్‌మెంట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం '24', 'మనం', 'హలో' చిత్రాల ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో బన్నీ తర్వాతి సినిమా ఉంటుందని టాక్. అయితే దీనిపై ఇంకా అఫీషియల్ సమాచారం ఏమీ లేదు. అదే నిజమైతే సమంత హీరోయిన్‌గా నటించే అవకాశం ఉందట.


Click it and Unblock the Notifications











