పుష్పగాడు దిగుంటేనా.. ఆగస్ట్ 15ని ఎలా మిస్ చేసుకున్నార్రా, నెట్టింట బన్నీ ఫ్యాన్స్ ఆవేదన
మూడేళ్ల క్రితం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా పుష్ప-1 యావత్ భారతదేశాన్ని ఊపేసిన సంగతి తెలిసిందే. ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే ముఠాల మధ్య జరిగిన గ్యాంగ్ వార్ ఇతివృత్తంతో పీరియాడికల్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది అత్యధిక కలెక్షన్లు సాధించిన భారతీయ చిత్రాల లిస్ట్‌లో స్థానం సంపాదించింది. బాలీవుడ్‌లో అయితే ఏమాత్రం అంచనాల్లేకుండా బరిలో హిందీ బెల్ట్‌ను ఊపేసింది.
ఈ సినిమాలోని డైలాగులను రాజకీయ నాయకులు కూడా ప్రస్తావించారంటే పుష్ప మేనియాను అర్ధం చేసుకోవచ్చు. దీంతో ఈ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న పుష్ప-2 కోసం దేశ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూశారు. స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్ట్ 15న పుష్ప-2ని విడుదల చేస్తామని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది. కానీ అనూహ్యంగా పుష్ప-2 విడుదలను వాయిదా వేస్తున్నట్లుగా మేకర్స్ సంచలన ప్రకటన చేయడంతో టాలీవుడ్ , బన్నీ ఫ్యాన్స్ షాకయ్యారు.

ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఆగస్ట్ 15న రిలీజ్ అవ్వాల్సిన ఈ మూవీని డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని తెలిపింది. అయితే పవన్ కళ్యాణ్‌కు, ఆయన అభిమానులకు భయపడే పుష్ప-2 రిలీజ్‌ను వాయిదా వేసినట్లుగా సోషల్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతలోనే సుకుమార్, అల్లు అర్జున్‌ల మధ్య కూడా విభేదాలు చోటు చేసుకున్నాయని పుకార్లు వినిపించాయి. కానీ పుష్ప ది రూల్ వాయిదా పడటానికి అసలు కారణాలేంటీ అనేది మాత్రం బయటకు రాలేదు.
కానీ ఆగస్ట్ 15న పుష్ప-2 విడుదల అయ్యింటే బాగుండేదని ఆన్‌లైన్‌లో బన్నీ ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. పుష్పగాడు పక్కకి తప్పుకోవడంతో చిన్నా , పెద్ద సినిమాలు ఈ డేట్‌ని లాక్ చేసుకున్నాయి. మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్, తంగలాన్, ఆయ్ సహా పలు చిత్రాలు ఆగస్ట్ 15న రిలీజ్ అయ్యాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న న్యూస్‌ను బట్టి ఈ సినిమాలు మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నాయని అంటున్నారు. అయితే పర్లేదని జనం ఫీలవుతుండటంతో నాలుగు రోజుల పాటు బాక్సాఫీస్ కళకళలాడతాయని, తద్వారా నిర్మాత సేఫ్ జోన్‌లోకి వస్తాడని ట్రేడ్ వర్గాల అంచనా.
అన్నీ అనుకున్నట్లుగా జరిగితే గురువారం పుష్పగాడు సందడి చేసేవాడు. గురువారం ఇండిపెండెన్స్ డే, శుక్రవారం వరలక్ష్మీ వ్రతం, శని, ఆదివారాలు సహా మొత్తంగా నాలుగు రోజులు థియేటర్లలో పండుగ వాతావరణంతో పాటు .. కలెక్షన్లు సైతం అదిరిపోయేవని అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేశారు. పోనీ సినిమా ఎలాగూ రిలీజ్ కాలేదు.. కనీసం స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ ఓ పోస్టర్, చిన్న టీజర్ రిలీజ్ చేసినా బాగుండేదని అల్లు అర్మీ ఆవేదన. తమ బాధను పంచుకుంటూ బన్నీ ఫ్యాన్స్ పెడుతున్న పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











