అల్లు అర్జున్ అర్మీ తలనొప్పి..బన్నీ ఫ్యాన్స్ అత్యుత్సాహంతో..
గత కొన్ని వారాలు కితం తెలుగు సినిమా దగ్గర ప్రముఖ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విషయంలో ఎంత కాంట్రవర్సీ జరిగిందో అందరికీ తెలిసిందే. పొలిటికల్ పరంగా అల్లు అర్జున్ తీసుకున్న కొన్ని డెసిషన్స్ వారి ఫ్యామిలీ అభిమానుల్లో కలహాలు తెచ్చి పెట్టాయి. కాగా అవి ఇప్పటికీ కొనసాగుతూనే ఉండగా అల్లు అర్జున్ పై అయితే తటస్థుల్లో కాస్త నెగిటివ్ కూడా పెరుగుతుంది అనేది కొత్త మాట. ఇంకొంతమంది విశ్లేషకులు అయ్యితే అల్లు అర్జున్ కి ఇంకా మెచ్యూరిటీ రాలేదని కామెంట్స్ చేస్తున్నారు.
దీనితో గడిచిన కొన్ని వారాలు నెలలు నుంచి అల్లు అర్జున్ కోసం సినీ వర్గాల్లో ఎక్కువ వినిపిస్తూ వస్తుంది. కాగా ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ అభిమానులు కూడా అటు ఆన్ లైన్ లో ఇటు ఆన్ లైన్ లో కూడా తమ హీరోని అగ్రెసివ్ గానే డిఫెండ్ చేస్తున్నారు. ఇక ఆఫ్ లైన్ అయితే కొందరు అత్యుత్సాహపు అభిమానులు అల్లు అర్జున్ కి ఇప్పుడు వరకు ఉన్న కాంట్రవర్సీలు చాలవు అన్నట్టు కొత్త తలనొప్పులు తీసుకొస్తున్నారని చెప్పాలి.

కాగా అల్లు అర్జున్ పై సోషల్ మీడియాలో నెగిటివ్ వార్తలు ప్రచారం చేస్తున్నారన్న నేపథ్యంతో ఆ హ్యాండిల్ కి చెందిన ఓ ఆఫీస్ పై అల్లు అర్జున్ అభిమానులు దాడులు చెయ్యడానికి ప్లాన్ చేసారని వాళ్ళని పట్టుకునే క్రమంలో కొందరు పారిపోతే ఒకరు దొరికారాని వారు వీడియో కొన్ని ఫోటోలు పెట్టి రివీల్ చేశారు. వారు వచ్చినట్టుగా సీసీ టీవీ ఫుటేజ్ కూడా ఉందని తెలిపారు. అలాగే దయచేసి మా ఆఫీస్ పై ఎలాంటి దాడులు చెయ్యొద్దని అల్లు అర్జున్ గారు తన అభిమానులని ఇలాంటి వాటిపై దృష్టి పెట్టాలని కోరారు.
దీనితో ఈ సరికొత్త ఇష్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా దీనిపై ఇతర హీరోల అభిమానులు బన్నీ ఫ్యాన్స్ మరీ ఇంతలా ఉన్నారేంటి? అసలు ఏం చేద్దామని అంత ధైర్యంగా వెళ్లారంటూ మరిన్ని కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఇప్పుడు అల్లు అర్జున్ అయితే తన భారీ పాన్ ఇండియా సీక్వెల్ చిత్రం పుష్ప 2 ది రూల్ ని చేస్తుండగా ఈ సినిమాని దర్శకుడు సుకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
అలాగే ఈ సినిమా షూటింగ్ రీసెంట్ గా కొన్ని రోజులు బ్రేక్ పడగా ఇంకొన్ని రోజుల్లో మళ్ళీ మొదలు కానున్నట్టుగా తాజాగా సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తెలిపాడు.. ఇక ఈ సినిమాల్లో అల్లు అర్జున్ సరసన రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా అనసూయ భరద్వాజ్, సునీల్, అలాగే మలయాళ వెర్సటైల్ నటుడు ఫహద్ ఫాజిల్ లు నెగిటివ్ పాత్రల్లో కనిపించనున్నారు. అలాగే ఈ ఏడాది డిసెంబర్ 6కి సినిమాని పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ అలాగే దర్శకుడు సుకుమార్ కూడా నిర్మాణం వహిస్తున్నారు.


Click it and Unblock the Notifications











