అప్డేట్ కావాలి.. ‘పుష్ప’పై బన్నీ ఫ్యాన్స్ రచ్చ
అల్లు అర్జున్ ఫ్యాన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో గోల చేస్తున్నారు. పుష్ప సినిమా అప్డేట్ కావాలంటూ నానా హంగామా చేస్తున్నారు. కరోనా కారణంగా వాయిదా పడ్డ షూటింగ్‌ను ఎప్పుడు ప్రారంభిస్తారు.. ఎప్పుడు టీజర్ వంటివి రిలీజ్ చేస్తారో చెప్పండి అంటూ ఫ్యాన్స్ అడుగుతున్నారు. అసలే కరోనా వల్ల ఆరేడు నెలలు సినిమా షూటింగ్ లేకపోవడం, ప్రస్తుతం బయటకు వెళ్లే పరిస్జితులు లేకపోవడంతో చాలానే మార్పులు చేర్పులు జరుగుతున్నాయట. మన రాష్ట్రంలోనే సెట్స్ వేసి షూటింగ్ చేద్దామని యూనిట్ భావిస్తోందని టాక్.
అయితే పుష్ప చిత్రం కోసం రాష్ట్రంలోనే దట్టమైన అడువులు ఎక్కడున్నాయి.. షూటింగ్ చేసుకోవడానికి ఎక్కడ అనువుగా ఉంటుందని పుష్ప యూనిట్ వెదుకులాటలో పడిందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే నేడు యూనిట్ ఏదో ఒక అప్డేట్ ఇస్తుందని ఆశపడ్డారు ఫ్యాన్స్. పుష్ప అప్డేట్ కావాలంటూ ఫ్యాన్స్ నేషనల్ వైడ్‌గా పుష్ఫ హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. నేడు బన్నీ ఉదయ గోదావరి జిల్లాలకు వెళ్తున్నాడని, అక్కడ కొన్ని లొకేషన్లో పర్యాటిస్తారని సోషల్ మీడియాలో ప్రచారం సాగింది.

కానీ చివరకు అది రూమర్ అని తెలియడంతో నెటిజన్లు నిరుత్సాహపడ్డారు. ట్వీట్ల యుద్దంతో మైత్రీ వారికి మా బాధ అర్థం అవుతుందన్న ఉద్దేశ్యంతోనే ట్రెండ్ చేస్తున్నాం.. ఏదో ఒక అప్డేట్ ఇవ్వండి అంటూ ఫ్యాన్స్ వేడుకుంటున్నారు. మొత్తానికి పుష్ప కోసం ఫ్యాన్స్ మాత్రం ఓ రేంజ్‌లో ఎదురుచూస్తున్నారని అర్థమైంది. బన్నీ కూడా పుష్ప కోసం సన్నద్దమవుతున్నాడు. మరో వైపు రష్మిక మందాన్న కూడా రెడీ అవుతోంది. నవంబర్‌లో పుష్ప సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం.



Click it and Unblock the Notifications











