అల్లు అర్జున్ రిపబ్లిక్ డే సెలెబ్రేషన్స్.. కొడుకు, కుమార్తెతో కలసి జెండా ఆవిష్కరణ!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాను చేసే ప్రతి పనిలో ప్రత్యేకతని చాటుకుంటాడు. నేడు ఇండియా 70వ గణతంత్ర వేడుకలు జరుపుకుంటోంది. అల్లు అర్జున్ తన నివాసంలోనే రిపబ్లిక్ డేని కుటుంబ సభ్యులతో జరుపుకున్నాడు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ భారతీయులందరికి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపాడు. తాను జెండా ఆవిషరించిన ఫోటోని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు.

అల్లు అర్జున్ తన కొడుకు అయాన్, కుమార్తె అర్హతో కలసి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన ఫోటో వైరల్ అయింది. ఇక సినిమాల విషయానికి వస్తే బన్నీ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించేందుకు సిద్ధం అవుతున్నాడు. నా పేరు సూర్య చిత్రం నిరాశ పరిచిన తర్వాత అల్లు అర్జున్ మరో చిత్రాన్ని ప్రారంభించలేదు. త్రివిక్రమ్ దర్శత్వం వహించబోయే చిత్రాన్ని అల్లు అరవింద్, రాధాకృష్ణ నిర్మించనున్నారు.

ఆలు అర్జున్ కు త్రివిక్రమ్ తో ఇది హ్యాట్రిక్ మూవీ.గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీనితో వీరి కాంబోలో వస్తున్న మూడవ చిత్రంపై ప్రారంభానికి ముందే అంచనాలు నెలకొంటున్నాయి. ఫిబ్రవరిలో ఈ చిత్రం ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











