ఇది నా గొప్ప కాదు.. మీ ఆశీర్వాదమే.. అల్లు అర్జున్!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త్వరలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శత్వంలో నటించబోతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ ఇది. త్రివిక్రమ్, బన్నీ కాంబోలో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు మంచి విజయం సాధించాయి. గత ఏడాది వచ్చిన నాపేరు సూర్య చిత్రం తర్వాత బన్నీ మరో చిత్రాన్ని ప్రారంభించలేదు. కొత్తఏడాది సందర్భంగా త్రివిక్రమ్ చిత్రాన్ని ప్రకటించాడు.
అల్లు అరవింద్, రాధాకృష్ణ కలసి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు. ఈ చిత్రానికి సంబందించిన మరిన్ని విశేషాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా అల్లు అర్జున్ సోషల్ మీడియాలో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ట్విట్టర్ ఖాతాలో బన్నీ ఫాలోవర్స్ సంఖ్య 3 మిలియన్ల దాటింది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశాడు.

నన్ను ఫాలో అవుతున్న 3 మిలియన్ల అభిమానులకు ధన్యవాదాలు. మీరు నాపై చూపించే ప్రేమకు రుణపడి ఉంటాను. ఈ ఘనత నా గొప్ప కాదు. మీ ఆశీర్వాద బలమే అని అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు. అల్లు అర్జున్ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటాడు. తనకు సంబందించిన విశేషాలని సోషల్ మీడియా ద్వారానే అభిమానులతో పంచుకుంటుంటాడు.


Click it and Unblock the Notifications











