అల్లు అర్జున్ మీద దారుణమైన ట్రోలింగ్.. ఆ పేర్లతో ఆడుకుంటున్న నార్త్ నెటిజన్లు!
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా ఎంత పెద్ద విజయాన్ని అందుకుంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పూర్తిగా కరోనా భయం తొలగిపోని రోజుల్లో కూడా సౌత్, నార్త్ రాష్ట్రాల్లో కూడా పుష్ప సినిమా అద్భుతమైన కలెక్షన్లు రాబట్టింది.. అయితే అప్పుడు భ్రమరాధం పట్టిన నార్త్ ప్రేక్షకులు ఇప్పుడు ఆయన మీద విమర్శల వర్షం కురిపిస్తునారు. ఆ వివరాలోకి వెళితే

ఉత్తరాదిలో కూడా
అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా మొదటి భాగం డిసెంబర్ నెలలో విడుదలై అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా ఫహాద్ ఫాజిల్, సునీల్ అనసూయ వంటి వారు నెగిటివ్ పాత్రలో కనిపించారు. మైత్రి మూవీ మేకర్స్ మొత్తం శెట్టి మీడియా వర్క్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక ఈ సినిమా కేవలం దక్షిణాదిలోనే కాకుండా ఉత్తరాదిలో కూడా సత్తా చాటింది.

రెండో భాగాన్ని
అయితే నిజానికి ఈ సినిమా మొదట అనుకున్నప్పుడు కేవలం ఒక భాగంగా విడుదల చేయాలని అనుకున్నా షూటింగ్ మొదలు పెట్టిన తరువాత నిడివి అంతకంతకూ పెరుగుతూ వెళ్లడంతో రెండు భాగాలుగా విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ఫిక్స్ అయ్యారు. అలా ఆ ప్లాన్ లో భాగంగా మొదటి భాగాన్ని పుష్ప ది రైజ్ అని రెండో భాగాన్ని పుష్ప ది రూల్ అని టైటిల్స్ ఫిక్స్ చేశారు. పుష్ప మొదటి భాగం 2021వ సంవత్సరంలో విడుదల చేయగా రెండో భాగాన్ని 2022వ సంవత్సరం చివరిలో విడుదల చేయాలని తొలుత భావించారు.

లావుగా
ఇక ఇదిలా ఉండగా ఇక అల్లు అర్జున్ పార్ట్ 1 కంటే పార్ట్ 2లో ఇంకాస్త భిన్నంగా కనిపించబోతున్నారని అంటున్నారు. సుకుమార్ డిజైన్ చేసిన సీక్వెల్ లో బన్నీ కాస్త లావుగా కనిపించాల్సి ఉందట. అందుకే, ఆయన ఇప్పుడు బొద్దుగా తయారయ్యారట. కానీ ఇప్పుడు బన్నీ లుక్స్‌పై నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా పుష్ప రాజ్ లుక్‌లో ఉన్న బన్నీ ఫొటోను మనవ్ మంగ్లానీ అనే బాలీవుడ్ ఫోటోగ్రాఫర్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.

సోషల్ మీడియాలో వైరల్
ఈ పిక్స్ చూసిన ఒక బాలీవుడ్ నెటిజన్ వడా పావ్ అంటూ కామెంట్ చేశాడు. మరో నెటిజన్ బన్నీ రోజురోజుకీ బుద్దాలా(లావు)గా తయారువుతాన్నాడని కామెంట్ చేయగా మరో వ్యక్తి అయితే క్రికెటర్ మలింగా తరహాలో కనిపిస్తున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. ఇక పుష్ప ది రూల్ గురించి చెప్పాలంటే పుష్ప సీక్వెల్ గురించిన అప్‌డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే 'సీక్వెల్‌లో రష్మిక పాత్ర శ్రీవల్లి చనిపోయింది' అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అదంతా ట్రాష్
అందుకే జరుగుతున్న ప్రచారంపై పుష్ప నిర్మాత వై.రవిశంకర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. పింక్‌విల్లాతో మాట్లాడుతూ "అదంతా ట్రాష్" అని ఆయన కామెంట్ చేశారు. "ఇదంతా అర్ధంలేనిది. ఇప్పటి వరకు ఫెయిర్ అండ్ ఫ్రాంక్‌గా మేమే కథ వినలేదు కాబట్టి అలా జరిగే అవకాశం కాదు, ఇవన్నీ ఊహాగానాలే అంటూ కామెంట్స్ చేశారు.


Click it and Unblock the Notifications











