Allu Arjun: అల్లు అర్జున్ కు మరో బిగ్ రిలీఫ్.. కానీ, ఆ కండీషన్స్ అప్లై..
Allu Arjun Case: సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో నేడు మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అల్లు అర్జున్ కు షరతులతో కూడిన రెగ్యులర్ బెయిల్ ను మంజూరు చేసిన నాంపల్లి కోర్టు మరో బిగ్ రిలీఫ్ ఇచ్చింది. కానీ, అయితే.. కోర్టు కొన్ని షరతులను పెట్టింది. ఇంతకీ ఆ రిలీఫ్ ఏంటీ? మరో సారి పెట్టిన కండిషన్స్ ఏంటంటే? మీరూ కూడా ఓ లూక్కేయండి.
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ కు రెగ్యులర్ బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా అల్లు అర్జున్ తనకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. అదే విధంగా ప్రతీ వారం పోలీసు స్టేషన్ హాజరు కాకుండా మినహాయింపు కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. వీటి పైన విచారణ చేసిన నాంపల్లి కోర్టు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో నాంపల్లి కోర్టులో హీరో అల్లు అర్జున్‌కు ఊరట ఇచ్చింది. అల్లు అర్జున్ కు బెయిల్ సమయంలో విధించిన షరతులను సడలించింది.

అల్లు అర్జున్ రెగ్యూలర్ బెయిల్ పొందిన తరువాత ప్రతీ ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ముందు అల్లు అర్జున్ హాజరవుతున్నారు. అయితే.. భద్రతా కారణాల దృష్ట్యా అల్లు అర్జున్ మినహాయింపు ఇవ్వాలని అల్లు అర్జున్ కోరారు. అల్లు అర్జున్ దాఖలు చేసిన పిటీషన్ పైన విచారణ చేసిన కోర్టు.. షరతులను సడలించింది. అలాగే.. కొన్ని మినహాయింపులు ఇచ్చింది. ఈ ఇందులో భాగంగా ప్రతీ ఆదివారం పోలీసు స్టేషన్ లో హాజరు కావాలనే నిబంధనలను తొలగించింది. అలాగే.. అల్లు అర్జున్ విదేశాలకు వెళ్లేందుకు కూడా కోర్టు అనుమతించింది.
ఈ కేసు విచారణ దశలో ఉన్న నేపథ్యంలో విదేశాలకు వెళ్లేందుకు వీలులేదని కోర్టు తొలుత చెప్పినా.. తాజాగా అల్లు అర్జున్‌ను విదేశాలకు వెళ్లేందుకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు చార్జ్‌షీట్ అయ్యేంత వరకు విచారణ కొనసాగనుంది. ఈ సమయంలో అల్లు అర్జున్‌ను విచారణ చేయాలని భావిస్తే నోటీసు ఇచ్చి పోలీసులు విచారణ హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. ఇలా నాంపల్లి కోర్టు .. ఆదేశాలతో అల్లు అర్జున్ కు కొంత మేర రిలీఫ్ దక్కినట్లుగానే కనిపిస్తోంది.

డిసెంబర్ 4న హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో 35 ఏళ్ల రేవతి అనే మహిళ మరణించింది. ఆమె ఎనిమిదేళ్ల కొడుకు గాయపడ్డాడు, దీంతో సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు డిసెంబర్ 13న అల్లు అర్జున్ అరెస్టయ్యారు. మరుసటి రోజు డిసెంబర్ 14న తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ పై విడుదలయ్యారు. జనవరి 10తో ముగిసిన నాలుగు వారాల పాటు ఇచ్చిన మధ్యంతర బెయిల్ గడువు ముగిసింది. ఈ కేసులో బన్నీని నిందితుడు నంబర్ 11గా పేర్కొన్నారు. తాజాగా బన్నీకి రిలీఫ్ లభించింది.


Click it and Unblock the Notifications











