twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మరో సినిమాకు ఓకే చెప్పేసిన అల్లు అర్జున్.. పవన్ కల్యాణ్‌ను డైరెక్ట్ చేసిన దర్శకుడితో మూవీ.!

    By Manoj
    |

    స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దూకుడు ప్రదర్శిస్తున్నాడు. ఒకప్పుడు వరుసగా సినిమాలు చేసిన ఈ యంగ్ హీరో.. కొన్నేళ్లుగా కొంచెం స్లో అయ్యాడు. ఇక, తన గత చిత్రం 'నా పేరు సూర్య' తర్వాత చాలా రోజుల పాటు గ్యాప్ తీసుకున్నాడు. దీంతో బన్నీ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. దీంతో ఇకపై అతడు వరుసగా సినిమాలు చేయాలని డిసైడ్ అయిపోయాడు. ఇందులో భాగంగానే ప్రస్తుతం అతడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 'అల.. వైకుంఠపురములో..' అనే సినిమా చేస్తున్నాడు. ఇది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఇది కాకుండా సుకుమార్‌తో సినిమానూ ప్రకటించాడు. తాజాగా అతడు మరో సినిమాకు ఓకే చెప్పేశాడని ఓ వార్త బయటకు వచ్చింది. ఇంతకీ బన్నీ ఏ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు..? పూర్తి వివరాల్లోకి వెళితే..

     హ్యాట్రిక్ కొట్టాలని కసిగా చేస్తున్నారు

    హ్యాట్రిక్ కొట్టాలని కసిగా చేస్తున్నారు

    అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ‘అల.. వైకుంఠపురములో..' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు ముందు వీళ్లిద్దరి కాంబినేషన్‌లో రెండు హిట్ చిత్రాలు వచ్చాయి. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సారి కూడా హిట్ కొట్టి హ్యాట్రిక్ విజయాలను నమోదు చేయాలని వీళ్లిద్దరూ కసిగా పని చేస్తున్నారు. ఈ మూవీ సంక్రాతికి విడుదల కానుంది.

    దీని తర్వాత కూడా భారీ స్థాయిలోనే

    దీని తర్వాత కూడా భారీ స్థాయిలోనే

    ‘అల.. వైకుంఠపురములో..' మూవీ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగానే అల్లు అర్జున్.. మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. దానిని క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించనున్నాడు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో బన్నీ సరసన కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా నటిస్తోంది.

    పవన్ సినిమా.. ఆ ప్రాజెక్టు ఆగిపోయినట్లే

    పవన్ సినిమా.. ఆ ప్రాజెక్టు ఆగిపోయినట్లే

    వాస్తవానికి అల్లు అర్జున్ దిల్ రాజు నిర్మాణంలో ‘ఐకాన్' అనే సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. ఇది ‘అల' తర్వాత స్టార్ట్ అవుతుందని ప్రచారం జరిగింది. దీనిని ‘ఎంసీఏ - మిడిల్ క్లాస్ అబ్బాయి' ఫేమ్ వేణు శ్రీరామ్‌ తెరకెక్కిస్తాడని అన్నారు. కానీ, బన్నీ.. సుకుమార్‌తో సినిమా చేయడం.. వేణు శ్రీరామ్ ‘పింక్' రీమేక్ చేస్తుండడంతో ఈ ప్రాజెక్టు ఆగిపోయినట్లేనన్న టాక్ వినిపిస్తోంది.

    మరో సినిమాకు సైన్ చేసిన బన్నీ

    మరో సినిమాకు సైన్ చేసిన బన్నీ

    జనవరిలో ఓ సినిమాతో వస్తున్నాడు బన్నీ. దాని తర్వాత సుకుమార్‌తో చేసే సినిమా షూటింగ్‌లో పాల్గొంటాడు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో జరిగే ఈ సినిమా కోసం బన్నీ ఐదు నెలలు సమయం కేటాయించాడని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇది విడుదల కాకముందే ఈ స్టైలిష్ హీరో మరో సినిమా చేయబోతున్నాడని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది.

    Recommended Video

    CineBox: Mahesh Babu To Play Gangster | 90ML Movie Review | Disco Raja Teaser Review
    పవన్ కల్యాణ్‌ను డైరెక్ట్ చేసిన దర్శకుడితో

    పవన్ కల్యాణ్‌ను డైరెక్ట్ చేసిన దర్శకుడితో

    అల్లు అర్జున్ చేయబోయే ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ బాబీ అలియాస్ కేఎస్ రవీంద్ర తెరకెక్కించబోతున్నాడని సమాచారం. ప్రస్తుతం ‘వెంకీ మామ' సినిమాను డైరెక్ట్ చేసిన బాబీ.. ఇటీవల బన్నీకి స్టోరీ చెప్పాడని, దానికి స్టైలిష్ స్టార్ వెంటనే ఓకే చెప్పేశాడని అంటున్నారు. దీన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో చేయనున్నారని టాక్. ఈ డైరెక్టర్ గతంలో పవన్ కల్యాణ్‌తో ‘సర్ధార్ గబ్బర్ సింగ్' అనే సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే.

    English summary
    Stylish Star Allu Arjun and the Wizard of words Trivikram Srinivas coming together for third time for "Ala Vaikunthapurramuloo". Two crazy production houses Geetha Arts and Haarika & Hassine Creations producing this project. After This Bunny Will Do Movie With Bobby.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X